ఫోకస్

సాహసోపేతమైన నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో ఓబిసిలు 50 శాతానికిపైగా ఉన్నారు. ఓబిసిల సముద్ధరణ, హక్కుల పరిరక్షణకు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (జాతీయ బిసి కమిషన్)కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం గొప్ప సాహసవంతమైనది. ఈ నిర్ణయం మంచిది. అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా బిసిలు వెనకబడి ఉన్నారు. అనేక రాష్ట్రాల్లో ఇంకా సామాజిక వివక్షతకు బిసిలు గురవుతున్నారు. బిసిల సంక్షేమంకోసం ఎన్నో పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. కాని బిసిల్లో చాలా వర్గాలకు ఈ ఫలాలు అందాల్సి ఉంది. పైగా రాజకీయంగా బిసిలు వెనకబడి ఉన్నారు. సమాజంలో బిసిల జనాభా 50 శాతానికిపైగా ఉన్నా, ఇంకా అనేక కీలక పదవులకు దూరం. ఒక ఎంపి, ఎమ్మెల్యే పదవుల్లో బిసిలకు రిజర్వేషన్లు లేవు. ఈ రంగంలో కూడా రిజర్వేషన్లు ఉండాలి. అప్పుడే రాజ్యాధికారం బిసిలకు చేరవవుతుంది. ప్రస్తుతం స్థానిక సంస్థలకే రిజర్వేషన్లు పరిమితం. దేశ జనాభాలో సగం మంది బిసిలు ఉన్నా, ఎంతమంది బిసిలు ఎంపీలవుతున్నారు? ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారు? న్యాయవ్యవస్ధలో హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఎంతమంది బిసి న్యాయకోవిదులు ఉన్నారు? పారిశ్రామిక రంగంలో కూడా బిసిలు వెనకబడి ఉన్నారు. వీరికి ప్రభుత్వం, బ్యాంకులు ఆర్థిక ప్రోత్సాహం కల్పించాలి. రాయితీలు ఇవ్వాలి. జాతీయ బిసి కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇవ్వడాన్ని రాజకీయం చేయరాదు. ఇది ముమ్మాటికీ తప్పు. జనాభాకు తగ్గట్టుగా బిసిలకు రాజ్యాంగ పదవుల్లో, అధికారంలో సరైన వాటా లేదు. ఇది బిసిలను అవమానపరచడమే. తమిళనాడులో బిసిల ఉద్యమం ఊపందుకోవడంవల్లే ద్రవిడ కజగం పార్టీలను బిసిలే నడిపిస్తున్నారు. ద్రవిడ ఉద్యమాలవల్ల బిసిలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర వహిస్తున్నారు. కర్నాటకలో సిద్ధరామయ్య బిసి వర్గానికి చెందిన నేత. కేరళలో సిపిఎం ముఖ్యమంత్రి విజయన్ కూడ బిసి సామాజిక వర్గానికి చెందినవారే. మధ్యప్రదేశ్ సిఎం చౌహాన్ కూడా ఓబిసి వర్గంనుంచి వచ్చారు. బిసిలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు, వారి హక్కులు భంగం కలగకుండా పరిరక్షించేందుకు బిసి కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇవ్వడం ఉత్తమమైన నిర్ణయంగా భావిస్తున్నాం.

- కె శివకుమార్ వైకాపా ప్రధాన కార్యదర్శి, తెలంగాణ