ఫోకస్

రిజర్వేషన్లు రాజ్యాంగ పరిధిలోనివే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కు, ఆ హక్కులు చట్ట పరిధిలోనే పరిష్కరించుకోవాలి, సాధించుకోవాలి. అయితే ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బిసిల రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. కొత్తగా ఓబీసీ రిజర్వేషన్ల సమస్య తెరపైకి వచ్చింది. ప్రజాస్వామ్య దేశంలో రిజర్వేషన్లు అడిగే హక్కు అందరికీ ఉంది. కానీ రాజ్యాంగం కల్పించే హక్కులను సామరస్య, చట్టబద్ధంగా వినియోగించుకోవాలి. దేశంలో ఓబిసిలు 50 శాతానికిపైగా ఉన్నారు. ఓబిసిల సముద్ధరణ, హక్కుల పరిరక్షణకు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (జాతీయ బిసి కమిషన్)కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదే. దీనికి అన్ని వర్గాల వారు, అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి. అన్ని కులాల్లోనూ పేదలు ఉన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడి ఉన్నారు. కొన్ని కులాలు అనేక రాష్ట్రాల్లో సామాజిక వివక్షతకు గురవుతున్నారు. బిసిల సంక్షేమంకోసం ఎన్నో పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. కానీ బిసిల్లోనే కాకుండా ఇతర కులాల వారికి కూడా చాలావరకు ఈ ఫలాలు అందాల్సి ఉంది. పైగా రాజకీయంగా బిసిలు వెనకబడి ఉన్నప్పటికీ అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోంది. బిసిల జనాభా 50 శాతానికిపైగా ఉన్నా, ఇంకా అనేక కీలక పదవులకు దూరంగా ఉంటున్నారు. కులాల జనాభా ప్రాతిపదికన ఆర్థిక ప్రోత్సాహం అందాలి. సంక్షేమ పథకాల్లో వారికి రాయితీలు ఇవ్వాలి. రాజ్యాంగ హక్కులకు భంగం కలుగకుండా రిజర్వేషన్లు పాటిస్తే మంచిది.

-పాండురంగారావు లోక్‌సత్తా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు