ఫోకస్

అట్టడుగు వర్గాలకు మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప వర్గీకరణ వల్ల బిసిల్లోని అట్టడుగు వర్గాలకు మేలు కలుగుతుంది. బిసిల్లోని అన్ని వర్గాలకు న్యాయం చేసే నిర్ణయం ఇది. అణగారిన వర్గాలకు మేలు కలగాలని, సమాజంలో అందరికీ సమానంగా అవకాశాలు ఉండాలనే ఉద్దేశంతోనే రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయి. బిసిల్లోని అట్టడుగు వర్గాలకు సైతం ఇతరులతో సమానంగా అవకాశాలు లభించేందుకు ఉప వర్గీకరణ ఉపయోపడుతుంది. సామాజిక న్యాయం కోరుకునే వారంతా దీనిని స్వాగతిస్తారు. వర్గీకరణకోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఉప వర్గీకరణ తెలంగాణలో ఇప్పటికే అమలవుతోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అమలు అవుతుండగా, పలు రాష్ట్రాల్లో అమలు కావడం లేదు. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాల్సి వస్తుంది. క్రీమిలేయర్ కేటగిరీ ఆదాయ పరిమితి ఇప్పటివరకు ఆరు లక్షల రూపాయల సంవత్సర ఆదాయం. చాలాకాలం నుంచి ఈ ఆదాయ పరిమితి పెంచాలని పలువురు కోరుతూ వస్తున్నారు. ఇప్పుడు కేంద్రం దీనిని ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షలకు పెంచడాన్ని స్వాగతిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బిసి రిజర్వేషన్లు 20 ఏళ్ల నుంచి అమలవుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబిసిల సంఖ్య 15 శాతం కూడా దాటక పోవడం బాధాకరం. ఓబిసిలకోసం కేంద్ర మంత్రివర్గంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి. అదే విధంగా చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్లు ఉండాలి.

- బూర నర్సయ్య గౌడ్, భువనగిరి ఎంపి, టిఆర్‌ఎస్