ఫోకస్

కుటిల యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ స్థాయిలో ఓబీసీ వర్గీకరణ ప్రయత్నాలను స్వాగతించాల్సిందే. అయితే దీని వెనుకనున్న అధికారపక్ష బిజెపి కుటిల యత్నాన్ని ప్రతి ఒక్కరూ పసిగట్టాలి. భారత రాజ్యాంగంలో బిసిలకంటూ ప్రత్యేక రిజర్వేషన్ లేదు. అయితే ఎస్సీ, ఎస్టీలతోపాటు ఇతర వెనుకబడిన కులాలకు సైతం రిజర్వేషన్లను కల్పించాల్సి ఉంది. కొన్ని రాష్ట్రాలు ఈ ఒక్క క్లాజ్‌తో ఎవరికి వారు తమ ఇష్టానుసారం బిసిలకు రాజకీయ, విద్య, ఆర్థిక, ఉద్యోగ రిజర్వేషన్‌లను కల్పిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో బిసిల జాబితాలో 144 కులాలు ఉంటే అందరికంటే వెనుకబడ్డ గంగిరెద్దు, బుడబుక్కలు వంటి కులాలనుంచి గ్రామాల్లోనూ వార్డు స్థాయిలో రాజకీయ ప్రాతినిధ్యం లేదు. వాస్తవానికి యాదవ, గౌడ, పద్మశాలి ఉత్తరాంధ్రలో కళింగులు మాత్రమే రాజకీయ లబ్ధి పొందుతున్నారు. శిష్ట కరణాల తెగలనుంచి కొందరు కేంద్రంలో మంత్రులు కూడా అయ్యారు. బిజెపి దురుద్దేశ్యంతో యుపి ఎన్నికల సమయంలో బిసిల్లో కొన్ని కులాలను పక్కనబెట్టి వారిలో వారికి ద్వేషాన్ని రగిల్చారు. అయితే బిసి నేతలు తోటివారు మన సోదరులే అన్నది మరచిపోతుండడం బాధాకరం. యుపిలో మాయావతి సైతం ఇదే పన్నాగం పన్నుతున్నారు. ఏదిఏమైనా ఓబీసీలో ఉపవర్గీకరణను స్వాగతించాలి. అలాగే ఎపిలోనూ ఇదే రీతిలో రాజకీయ రిజర్వేషన్లలోనూ అమలు చేస్తే సంతోషిస్తాం.

- డాక్టర్ జి గంగాధర్ బిసి జనసభ వ్యవస్థాపక అధ్యక్షుడు