ఫోకస్

బిసిలకు సమన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓబీసీల వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే. జాతీయ బిసి కమిషన్ సిఫార్సుల మేరకు ఓబీసీ జాబితాలో సుమారు 5వేల బిసి కులాలకుగాను ఇప్పటికే 2480 కులాలను జాబితాలో చేర్చడంద్వారా బిసి వర్గాల్లోని అన్ని కులాలకు సమన్యాయం జరిగే అవకాశం ఉంది. అయితే వర్గీకరణ నివేదికకు కేంద్ర ప్రభుత్వం కేవలం మూడునెలల గడువు మాత్రమే విధించడంద్వారా ఉపవర్గీకరణలో పూర్తిస్థాయి పరిశీలన జరపడం సాధ్యం కాదు. సమగ్రంగా బిసి ఉపవర్గీకరణపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు మరింత సమయం పొడగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణలో మొత్తం ఇప్పటికే 113 బిసి కులాలను గుర్తించగా, వీటిలో 90 కులాల వరకు ఓబీసీ జాబితాలో చేర్చడం జరిగింది. కులాల స్థితిగతుల ప్రామాణికంగా కేంద్ర ప్రభుత్వం ఓబీసీ జాబితాలో బిసి కులాలను చేర్చడంద్వారా ఆర్థిక అసమానతలను దూరంచేసి రిజర్వేషన్ ఫలాలు పొందేందుకు ఆస్కారం ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్రంలో బిసి సామాజిక వర్గంలో ఏబిసిడి వర్గీకరణ అమల్లో కొనసాగుతుండగా ఆర్థిక స్థితిగతులు, వెనకబాటుతనం, సామాజిక అసమానతలను ప్రామాణీకంగా కేంద్రం ఓబీసీ వర్గీకరణ చేపట్టడం ద్వారా అత్యంత వెనకబడిన బిసి కులాలు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు పొందే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో బిసిలకు ఏబిసిడిఈ వర్గీకరణ ద్వారా 29శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తున్నాం. ఓబిసి జాబితాలో స్థానం కల్పించని అగ్నిక్షత్రియతోపాటు మరో నాలుగు కులాలు కూడా చేర్చాలని ఇటీవలే కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. వాటిని పరిశీలించి, ఓబీసీ జాబితాలో నోటిఫై చేయాల్సిన అవసరం కేంద్రంపై ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వెనకబడిన బిసి కులాల అభ్యున్నతికోసం దూరదృష్టితో 1000కోట్లు బడ్జెట్‌లో కేటాయించడమేగాక వారి సంక్షేమానికి పెద్దపీట వేసి నిర్దిష్టకార్యాచరణతో ముందుకు సాగుతున్నాం.

-జోగు రామన్న, బిసి సంక్షేమ శాఖ మంత్రి, తెలంగాణ