ఫోకస్

ప్రధానికి రుణపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓబిసి రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంతో దేశ ప్రజలంతా ప్రధాని మోదీకి రుణపడి ఉంటారు. అందులో ఎలాంటి అరమరికలు లేవు. దేశంలో కులాల గణాంకాలు సరైన రీతిలో తీసి పారదర్శకంగా ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి కులాల గణాంకాలు సేకరించిన రోజు కిందిస్థాయిలో సామాజికవర్గాలకు కూడా న్యాయం జరుగుతుంది. కేంద్రంలో 27 శాతం విద్యా, ఉద్యోగాల్లోనే బిసిలకు రిజర్వేషన్ ఉంది. ఇందులో క్రీమిలేయర్ ఎందుకు పెట్టారనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న. జస్టిస్ ఈశ్వరయ్య ఎబిసిడి వర్గీకరణ జరిపితే బాగుంటుందని సిఫారసు చేశారు. కేంద్రం దీనిపై కూడా ఆధ్యయనం చేస్తోంది. భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలతో చర్చించి ఆయా ప్రాంతాల్లో ఉన్న సామాజిక సమస్యలపై దృష్టిసారించాలి. ఇవన్నీ చేయకుండా ఓబీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తే సరిపోదు. చట్టసభల విషయానికొస్తే రాజ్యాధికారానికి ఓటు బ్యాంక్‌గా ఉన్నారేతప్ప సగానికి పైగా ఉన్న బిసిలకు సముచిత స్థానంలేదు. జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కూడా కల్పించాలి. 96 ఉప కులాలు ఉన్నప్పుడు అదే రిజర్వేషన్.. ఇవాళ 150 కులాలు ఉన్నప్పుడు ఇదే. రిజర్వేషన్ శాతం పెంచకుండా ఎక్కడెక్కడి వారినో బిసిలలో చేర్చటం కుట్రపూరితం. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన అగ్రకులాల జాబితాలో ఉన్న కాపులు కూడా బిసి రిజర్వేషన్ కావాలనడం సమంజసంకాదు. కాపు సామాజికవర్గం రాజకీయంగా బలంగా ఉంది. సామాజిక పీడన ఆ కులానికి లేదు. రాజకీయాల్లో ప్రాధాన్యత ఉన్నందునే విద్య, ఉద్యోగ రంగాల్లో అడుగుతున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు అగ్రకులం కాదా. మన రాష్ట్రంలో కుప్పుస్వామి, సుబ్రహ్మణ్యస్వామి కమిషన్లు వేసి రాష్ట్రంలో కులాల స్థితిగతులు ఆధ్యయనం చేశారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని వారు తేల్చారు. రాజకీయ స్వలాభంకోసం కులాల మధ్య కుంపట్లు పెట్టి రిజర్వేషన్లు ఛిన్నాభిన్నం చేయాలనే దురుద్దేశం కనిపిస్తోంది. సామాజిక వెనుకబాటుతనం వల్లే బిసిలు వివక్షకు గురవుతున్నారు.

- కేసన శంకర్‌రావు, బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్