ఫోకస్

ఉపవర్గీకరణ ఎవరికి లాభం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓబీసీ ఉపవర్గీకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కమిషన్ వేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. చైర్‌పర్సన్‌ను నియమించిన నాటి నుండి 12 వారాలలోపు ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. ఈ కమిషన్ కేవలం ఓబీసీల ఉపవర్గీకరణ పరిశీలనకు మాత్రమే పరిమితం అవుతుంది. జాతీయ స్థాయిలో ఓబీసీ కేటగిరిలో క్రీమీలేయర్ గరిష్ఠ వార్షికాదాయం పరిమితిని ఆరు లక్షల నుండి 8 లక్షలకు పెంచుతూ కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. దీనివల్ల ఓబీసీ కేటగిరిలో 8 లక్షల వరకూ ఆదాయం ఉన్నవారు రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందవచ్చు. వాస్తవానికి ఓబీసీలను వర్గీకరించాలని 1992లోనే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. బీసీలను వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరగతులుగా వర్గీకరించడానికి న్యాయపరమైన ప్రతిబంధకాలు ఏమీ లేవు. ఇంద్రాసాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (డబ్ల్యుపిసి 930/1990)లో సుప్రీంకోర్టు 1992 నవంబర్ 16న తీర్పు చెప్పింది. ఒకవేళ ఏదైనా రాష్ట్రం బిసిలను వర్గీకరించాలనుకుంటే చట్టపరిధిలో అదేమీ అసాధ్యం కానేకాదు. దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, కర్నాటక, హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బిహార్, మహారాష్ట్ర, తమిళనాడు, జమ్మూ రాష్ట్రాల్లో బిసిల వర్గీకరణ అమలవుతోంది. 2015లో జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని బిసి కమిషన్, 2012-13లో పార్లమెంటరీ స్థారుూసంఘం కూడా బిసిలను వర్గీకరించాలని సిఫార్సు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 కింద ఉపవర్గీకరణపై కేంద్రం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో ఉన్న కులాలు, వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందడంలో ప్రస్తుతం ఉన్న అసమానతలను ఈ కమిషన్ పరిశీలిస్తుంది. ఓబీసీల ఉపవర్గీకరణకు ఎలాంటి యంత్రాంగం, ప్రమాణాలు, నిబంధనలు, కొలమానాలు ఉండాలో కూడా కమిషన్ పరిశీలిస్తుంది. ఎలాంటి శాస్ర్తియ విధానం అనుసరించాలో, కులాలు, వర్గాలు, ఉపకులాలు వాటి పర్యాయపదాలు గుర్తించి వాటిని సంబంధిత ఉపవర్గీకరణల వారీ వర్గీకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓబీసీ ఉపవర్గీకరణ నిర్ణయం ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉండబోతోందోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దేశంలో దశాబ్దాలుగా రిజర్వేషన్ల విధానం అమలులో ఉన్నా, బీసీలకు మాత్రం 1990లో మండల్ కమిషన్ ద్వారా రిజర్వేషన్లు ప్రాప్తించాయి. కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలలో విద్య, ఉద్యోగ రంగాల్లో వీటిని అమలుచేస్తున్నారు. అదీ నిర్ణీత ఆదాయ పరిమితి ఉన్నవారికి మాత్రమే దక్కుతోంది. ఆదాయ పరిమితి ఎక్కువగా ఉంటే వారిని సంపన్న శ్రేణిగా పరిగణిస్తూ రిజర్వేషన్లను ఇవ్వడం లేదు. దీంతో కొన్ని వర్గాలు తమకు అన్యాయం జరుగుతోందని భావిస్తున్నాయి. దేశం మొత్తం మీద 5 వేల వరకూ బీసీ కులాలు ఉండగా అందులో 2479 కులాలు మాత్రమే ఓబీసీ జాబితాలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 125 బీసీ కులాలు ఉండగా అందులో 112 మాత్రమే కేంద్ర ఓబీసీ జాబితాలో ఉన్నాయి. అలాగే తెలంగాణలో 113 బీసీ కులాలు ఉండగా అందులో 90 కులాలు మాత్రమే ఓబీసీ జాబితాలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నియమించే కమిషన్ తాజాగా కులాల స్థితిగతులను అధ్యయనం చేసి తదనుగుణంగా సిఫార్సులు చేస్తుంది. ఎపిలో 13, తెలంగాణలో 23 కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ చాన్నాళ్లుగా ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.