రాష్ట్రీయం

బీసీలకు బాబు పెళ్లి కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రంలో సింహభాగంగా ఉన్న బడుగులపై సిఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. బీసీల ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్లకు రూ.25 వేల సాయం అందించనున్నట్టు ప్రకటించారు.
అటు కాపు విద్యార్థులకూ బీసీ తరహా స్కాలర్‌షిప్‌లు ప్రకటించారు. ఐదుగురు సభ్యులున్న బీసీ గ్రూపునకు రూ.10 లక్షల చొప్పన స్వయం ఉపాధి పథకానికి పచ్చజెండా ఊపారు. బీసీ సంక్షేమమే సర్కారు లక్ష్యమని ప్రకటిస్తూనే, కాపుల అభివృద్ధికీ ప్రాధాన్యత ఇస్తున్నట్టు ప్రకటించారు. బుధవారం తన కార్యాలయంలో బీసీ ఫెడరేషన్లు, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ బీసీ కుటుంబాలకు ‘చంద్రన్న పెళ్లికానుక’ పథకం ప్రకటించారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేల వంతున పెళ్లి ఖర్చులకు సాయం అందించనున్నట్టు చెప్పారు. ఆదరణ పథకం ద్వారా బీసీలకు అధునాతన పనిముట్లు అందిస్తామన్నారు. బీసీల ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చేందుకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేసి రూ.1000 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. కాపు విద్యార్థులకు బీసీల మాదిరిగానే స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. బీసీ ఫెడరేషన్ ద్వారా ఐదుగురితో కూడిన బృందానికి రూ.10 లక్షల వంతున యూనిట్ ఖరీదుతో స్వయం ఉపాధి పథకాలు చేపట్టే ప్రతిపాదనకు ఆమోదం తెలిపామన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన జీవో వస్తుందన్నారు. ప్రభుత్వ చేయూతతో అట్టడుగు సామాజిక వర్గాలు బాగుపడాలని, ఆర్థిక పరపతి పెరగాలని ఆకాంక్షించారు. కాపు కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు, స్కాలర్ షిప్‌లకు రూ.1474.75 కోట్లు, వసతి గృహాలకు రూ.645 కోట్లు, బీసీ ఫెడరేషన్లకు రూ.300 కోట్లు, స్వయం ఉపాధికి రూ.366 కోట్లు మొత్తం రూ.5013.50 కోట్లు కేటాయించినట్టు వివరించారు.
2017-18లో 8,80,000 మంది బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇప్పటిదాకా 6,77,976 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నట్టు చెప్పారు. 2017-18లో 3,30,000 మంది ఈబిసిలకు ఉపకార వేతనాలు ఇవ్వాలన్నది లక్ష్యంగా వివరిస్తూ, 2,34,132 మంది నమోదు చేయించుకున్నారన్నారు.
బీసీలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ రూ.274.50 కోట్లు కేటాయించగా, రూ.137.25 కోట్లను రెండు విడతలుగా విడుదల చేశామన్నారు. ఆగస్టు 16దాకా బకాయిల కోసం రూ.76.35 కోట్లు కలిసి, ఇప్పటి వరకూ 487.92 కోట్లు విడుదల చేశామన్నారు. మొత్తం 4,84,714 మంది బీసీ విద్యార్థులు లబ్థి పొందారన్నారు. పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్స్ కింద 3,77,510 మంది విద్యార్థులు లబ్ధిపొందారన్నారు. ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.1042 కోట్ల బడ్జెట్‌ని కేటాయిస్తే, రూ.521 కోట్లు విడుదల చేశామన్నారు. సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ కార్పొరేషన్ రూపొందించిన పథకాల కరదీపికను సిఎం ఆవిష్కరించారు.
చిత్రం.. బీసీ ఫెడరేషన్లు, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు