రాష్ట్రీయం

పాసు పుస్తకం తనఖాలకు స్వస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రైతులు పంట రుణాల కోసం పట్టాదారు పాసు పుస్తకాలను బ్యాంకులలో తనఖా పెట్టే విధానానికి స్వస్తి పలుకనున్నట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేశాక ఆన్‌లైన్‌లోని సమాచారం ఆధారంగానే బ్యాంక ర్లు రైతులకు రుణాలివ్వాలని సూచించారు. భూసంబంధమైన వ్యవహారాలన్నీ రాజ్యాంగ పరంగా రాష్ట్ర పరిధిలోనే ఉండటంతో, భూరికార్డుల ప్రణాళనకు పూనుకున్నామన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనపై కలెక్టర్లతో సమావేశం కావడానికి ముందు రెవిన్యూ మంత్రి మహమూద్ అలీ, ఐటీ మంత్రి కె తారకరామారావు, సిఎస్ ఎస్‌పి సింగ్, భూరికార్డుల ప్రక్షాళన మిషన్ డైరెక్టర్ కరుణ తదితర ఉన్నతాధికారులతో ప్రగతి భవన్‌లో బుధవారం సమీక్షా నిర్వహించారు. భూరికార్డు ప్రక్షాళన వల్ల ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరుగకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సిఎం ఆదేశించారు. గ్రామాల్లో భూరికార్డులను సరిచేశాక రైతులంతా సమ్మతించి సంతకాలు చేశాకే తుధి జాబితాను బహిర్గతం చేయాలన్నారు. భూరికార్డుల సమగ్ర ప్రక్షాళన అసాంతం సులభంగా, సరళంగా, పారదర్శకంగా ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలన్నారు. కోర్టుల పరంగా ఏవిధమైన చిక్కులు, సమస్యలులేని భూములు 95 శాతం వరకు ఉంటాయని మొదట వాటి జాబితా ఖరారు చేయాలని సూచించారు.
సిఎం చేసిన సూచనలు...
* ఒకప్పుడు ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరుగా భూమిశిస్తు ఉండేది. అయితే కాలక్రమేణా రైతుల నుంచి శిస్తు వసూలుకు బదులుగా ప్రభుత్వమే ఎకరాకు రూ.8 వేలు సమకూర్చబోతుంది. దీంతో భూమికి సంబంధించి పూర్తి దృక్పథమే మారిపోతుంది.
* ప్రపంచవ్యాప్తంగా రైతులను అన్ని దేశాలు గౌరవిస్తున్నాయి. ఆహార స్వావలంబనపై దృష్టిపెట్టాయ. తెలంగాణ కూడా వ్యవసాయమే ప్రధాన వృత్తి కలిగిన రాష్ట్రం. పైగా సమశీతోష్ణ వాతావరణం ఉండటం వల్ల పంటలు బాగా పండుతాయి.
* వచ్చే ఏడాదిలో కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు పుష్కలంగా లభ్యమవుతాయి. వీటితో చెరువులు నింపుకుంటాం. దీని ద్వారా పూర్వపు ఏడు జిల్లాలకు కాళేశ్వరం నీళ్లు అందుబాటులోకి వస్తాయి. పంటలు బాగా పండి ప్రజలు, రైతులు బాగుపడతారు.
* పహాణి, సేత్వారీ లాంటి పాతకాలపు పదాలను తొలగించి తెలుగులో సరళంగా, సులభంగా ఉండే పదాలను చేర్చాలి. పహాణిలో ప్రస్తుతం ఉన్న కాలమ్‌లను తొలిగించి కొన్నింటినే ఉంచాలి. సర్వే నంబర్లలో బై నంబర్ల గోల్‌మాల్‌కు స్వస్తి పలకాలి.
* భూ రికార్డుల ప్రక్షాళన కోసం 1193 బృందాలను ఏర్పాటు చేసి ఒక్కో బృందానికి 9 గ్రామాలు కేటాయించాలి. భూరికార్డులు సరి చేయడానికి మూడు నెలల వ్యవధి పడుతుంది. బృందాల కేటాయింపుపై కలెక్టర్లు నిర్ణయిస్తారు.
* కోర్ బ్యాంకింగ్ విధానాన్ని భూరికార్డులకు అనుసరించాలి. భూ రికార్డులను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడానికి 1000 మంది ఐటీ నిపుణులను నియమించుకోవాలి. భూ రికార్డులకు సంబంధించిన పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండాలి.
* మ్యుటేషన్ ప్రక్రియ రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే అప్పటికప్పుడు జరగాలి. భూముల క్రయ విక్రయాలన్ని ఒకే విజిట్‌లో జరిగిపోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యాక డాక్యుమెంట్లు సంబంధిత వ్యక్తులకు కోరియర్ ద్వారా పంపించాలి.
* భూ వివాదాల పరిష్కారం కోసం ప్రస్తుతం ఉన్న రెవిన్యూ కోర్టులన్నింటినీ రద్దు చేసి, కలెక్టర్ కోర్టు ఒకే దానిని కొనసాగించాలి.
* భూ రికార్డులను పకడ్భందీగా త్వరితగతిన పూర్తి చేసిన ఎమ్మార్వోలు, ఆర్డీవోలకు ప్రోత్సాహకాలు, ప్రశంసాపత్రాలు ఇవ్వాలి.
* కలెక్టర్లతో సమావేశం జరిగాక, ఎమ్మార్వోలతోనూ రాష్టస్థ్రాయిలో సమావేశం ఏర్పాటు చేయాలి.
చిత్రం.. భూమి రికార్డుల ప్రక్షాళ కార్యక్రమంపై రెవిన్యూ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సిఎం కెసిఆర్