రాష్ట్రీయం

మూడంచెల్లో తేల్చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఆంధ్రకు కేటాయించిన భవనాలపై ఉన్నతస్థాయిలో సమీక్షించాలని గవర్నర్ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మూడంచెల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. తొలుత రోడ్లుభవనాల శాఖకు చెందిన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం జరపాలని భావిస్తున్నారు. తర్వాత మంత్రుల స్థాయిలో సమావేశం జరపాలని, చివరకు సిఎంల స్థాయిలో తుది సమావేశం నిర్వహించి ఒక అవగాహనకు వచ్చేలా చూడాలని గవర్నర్ యోచిస్తున్నట్టు సమాచారం. ఏపీకి కేటాయించిన భవనాల్లో ఖాళీగావున్న వాటిని తమకు అప్పగించాలంటూ టి.సిఎం కెసిఆర్ ఒకటి రెండు పర్యాయాలు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కోరారు. ఏయే భవనాలు ఖాళీగా ఉన్నాయో జాబితాను కూడా అధికారికంగా గవవర్నర్‌కు అందించారు. వాస్తవానికి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్‌ను పదేళ్లపాటు వినియోగించుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. కేంద్రం ఆదేశాల మేరకు ఉభయ రాష్ట్రాల గవర్నర్ నేతృత్వంలోనే హైదరాబాద్‌లోని భవనాలను ఇద్దరికీ కేటాయించారు. సచివాలయంలోని భవానాల్లో ఎ, బి, సి, డి బ్లాకులను (్భవనాలను) తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించగా, హెచ్ నార్త్, హెచ్ సౌత్, జె, కె, ఎల్ బ్లాకులను (్భవనాలను) ఏపీకి కేటాయించారు. 60 ఏళ్ల నుండి సి బ్లాకును సిఎం, సిఎస్ కోసం వినియోగిస్తూ వచ్చారు. సి బ్లాకు తెలంగాణకు కేటాయించడంతో దీన్ని తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, సిఎం పేషీకి చెందిన ఇతర అధికారులు వినియోగించుకుంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి అవసరాల కోసం 2014-15లో ఎల్ బ్లాకును తీర్చిదిద్దారు. ఈ బ్లాకులోని ఎడు, ఎనిమిదో అంతస్తులను ఏపీ సిఎం, సిఎస్‌ల అవసరాల కోసం 10 కోట్లతో ఆధునీకరించారు. హెచ్ సౌత్ బ్లాకును కూడా అప్పట్లో ఆధునీకరించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు 2016 చివర్లో ఏపీ సచివాలయం విజయవాడ, అమరావతికి తరలిపోయింది. అలాగే వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలను (డైరెక్టరేట్లు, కమిషనరేట్లు-హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్) కూడా అమరావతికి తరలించారు. సచివాలయంలో ఏపీకి కేటాయించిన ఐదు భవనాలతోపాటు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్‌కు కేటాయించిన దాదాపు 50కి పైగా భవనాలు ఖాళీగా ఉన్నాయి. ‘నామ్‌కే వాస్తే’గా ఈ భవనాల్లో ఒకరిద్దరు సిబ్బందిని కొనసాగిస్తున్నారు. ఈ భవనాలు ఏడాదిగా ఖాళీగా ఉండి చెత్తాచెదారంతో నిండిపోతున్నాయి. నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో భవనాలు శిథిలావస్థకు చేరే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన భవనాలపై సమగ్రంగా అధ్యయనం చేసి, నివేదిక సమర్పించాలంటూ గవర్నర్ తన కింది సిబ్బందిని ఆదేశించినట్టు తెలిసింది. దాంతో నిరుపయోగంగా ఉన్న భవనాల వివరాలు సేకరించడం, అవి ఏ పరిస్థితిలో ఉన్నాయో చూసి నివేదిక రూపొందించడంలో అధికారులు బిజీగా ఉన్నట్టు తెలిసింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తర్వాత భవనాలను ఏవిధంగా ఉపయోగించాలన్న అంశంపై గవర్నర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
చిత్రం.. ఏపీ సర్కారు వినియోగించకపోవడంతో వృధాగా పడివున్న భవంతి