అంతర్జాతీయం

మరిన్ని క్షిపణులు ప్రయోగిస్తాం: ఉత్తర కొరియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్: జపాన్ మీదుగా మరిన్ని క్షిపణులను ప్రయోగిస్తామని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. తాజాగా తాము చేసిన ప్రయోగం ఆరంభం మాత్రమేనని ఐరాస, అమెరికా తదితర దేశాల హెచ్చరికల నేపథ్యంలో వెల్లడించింది. ఉత్తర కొరియా మంగళవారం ప్రయోగించిన మధ్యంతర శ్రేణి క్షిపణి తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలను రేకెత్తించింది. ఈ నేపథ్యంలో మాట్లాడిన ఉత్తర కొరియా నాయకత్వం మరిన్ని క్షిపణి ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నాం కాసుకోమంటూ రెచ్చగొట్టే ప్రకటన చేసింది. తాజా ప్రయోగంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఐరాస, అమెరికా తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవల్సి వస్తుందంటూ ఉ.కొరియాను హెచ్చరించాయి. అమెరికా సైనిక కేంద్రం అయినా గవామ్‌పై కూడా క్షిపణులు ప్రయోగిస్తామంటూ ఉత్తర కొరియా కొన్ని రోజులుగా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ తాజా ప్రయోగం జరగడం పరిస్థితిని మరింత ఉద్రిక్తమయం చేసింది.