అంతర్జాతీయం

నిన్న టెక్సాస్.. నేడు లూసియానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోస్టన్: టెక్సాస్ రాష్ట్రాన్ని నిన్నటిదాకా కుండపోత వర్షాలతో ముంచెత్తిన హార్వే హరికేన్ బుధవారం మరోసారి లూసియానా రాష్ట్రంపై తన ప్రతాపాన్ని చూపించింది. అయిదు రోజుల క్రితం హోస్టన్ నగరానికి దగ్గర్లో తీరాన్ని దాటిన తర్వాత హార్వే హరికేన్ సముద్రం వైపు మళ్లినప్పటికీ బుధవారం తిరిగి లూసియానా రాష్ట్రంలోని కామెరాన్ వద్ద తీరాన్ని దాటిందని నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. ఫలితంగా రాష్టవ్య్రాప్తంగా గంటకు 72 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులతోపాటుగా 13నుంచి 25 సెంటీమీటర్ల దాకా కుండపోత వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నట్లు ఆ కేంద్రం తెలిపింది. మరో 48 గంటలపాటు లూసియానాతో పాటుగా పొరుగు రాష్టమ్రైన మిసిసిపిలో భారీ వర్షాల ముప్పు కొనసాగవచ్చని, ఆ తర్వాత పరిస్థితి మెరుగుపడుతుందని హరికేన్ సెంటర్ తెలిపింది. హార్వే తుపాను కారణంగా రోడ్లన్నీ నదుల్లాగా మారిపోయిన హోస్టన్ నగరంలో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది.
ఇప్పటికీ 8 వేల మంది అత్యవసర షెల్టర్లలోనే తలదాచుకుని ఉన్నారు. యుద్ధప్రాతిపదికపై సహాయక చర్యలను కొనసాగించడానికి ముందుజాగ్రత్త చర్యగా నగరంలో మంగళవారం రాత్రి పూట కర్ఫ్యూ విధించడం తెలిసిందే. అయితే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నందున హరికేన్ కారణంగా ఏ మేరకు నష్టం జరిగిందనే విషయం పూర్తిస్థాయిలో తెలియడానికి మరికొంత సమయం పట్టేట్లు కనిపిస్తోంది. మృతుల సంఖ్య 30 దాకా ఉండవచ్చని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.