ఆంధ్రప్రదేశ్‌

సామాన్యులకు అందుబాటులో ఇసుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో సామాన్య ప్రజానీకానికి అవసరాలకు సరిపడా ఇసుక అందుబాటులో ఉండేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి వెంకట సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రి, సూరయ్యపాలెం ఇసుక రీచ్‌లను బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాన్య ప్రజానీకానికి ఇసుక అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకుని ఉచితంగా ఇసుకను అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు. ఉచిత ఇసుక నిర్ణయం తీసుకున్నప్పటికీ బహిరంగ మార్కెట్లో ఇసుక ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు రావటంతో జిల్లా స్థాయి కమిటీలు నియమించి అక్రమ అమ్మకాల నియంత్రణకు కృషి చేస్తున్నామన్నారు. కేవలం ఇసుక రీచ్‌ల వద్ద లోడింగ్, ట్రాన్స్‌పోర్ట్ చార్జీల కింద లారీ, పడవల యజమానులకు చెల్లించేందుకు ధరలు నిర్ణయించి ఇసుక రవాణా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫెర్రి ఇసుక రీచ్‌ల నుండి విజయవాడకు లారీ ఇసుక లోడింగ్ రవాణా ఛార్జీల కింద 2,500 రూపాయలు నిర్ణయించామన్నారు. దీనికంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు సమాచారం ఉండడంతో ముఖ్యమంత్రి ఆదేశాలు అనుసరించి ఇసుక రీచ్‌ల వద్ద జరుగుతున్న పరిణామాలను స్వయంగా పర్యవేక్షించాలనే ఉద్దేశ్యంతో ఆకస్మిక తనిఖీలు చేశామన్నారు. ఈ సందర్భంగా ఫెర్రి, సూరయ్యపాలెం ఇసుక రీచ్‌ల వద్ద ఉన్న లారీ డ్రైవర్లతో మంత్రి మాట్లాడుతూ ఎవరికి తోలుతున్నారు.. ఎంతకు తోలుతున్నారు.. అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది డ్రైవర్ల నుండి ఇసుక కావలసిన యజమానుల ఫోన్ నెంబర్లు తీసుకుని వారితో నేరుగా మాట్లాడవలసిందిగా అక్కడున్న అధికారులను మంత్రి ఆదేశించారు. ఫెర్రిలో లోడింగ్ చేస్తున్న పడవ యజమానులు ధర గిట్టుబాటు కావడం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన మంత్రి తగిన న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఫెర్రీ ఇసుక రీచ్‌ల వద్ద లారీల కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయని, లారీ, పడవ, క్రేన్ యజమానులు ఎవరూ పట్టించుకోవడం లేదని మంత్రి దృష్టికి స్థానికులు తీసుకువచ్చారు. స్థానికుల విన్నపం మేరకు రోడ్డు మరమ్మతుల పనులు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణకు అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉందని, దీనిని అరికట్టడానికి ప్రత్యేక నిఘా వ్యవస్థ పనిచేస్తున్నదన్నారు. ఇప్పటికే జిల్లాలో 17 ఇసుక లారీలను సీజ్ చేశామన్నారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఇసుక రవాణా విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇసుకపై ఏదైనా సమాచారం ఉంటే 1100 కు సంప్రదించాలని మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనింగ్, జియాలజీ శాఖ సెక్రటరీ డి.శ్రీధర్ మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌పి ఎమ్.రవీంద్రనాథ్ బాబు, డిఎస్పీలు పి.విజయ్‌పాల్, ఎమ్.బాలాజీనాయుడు, అధికారులు పాల్గొన్నారు.