భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండేటి వెంకట రమణారావు, విజయవాడ, కృష్ణా
ప్ర: గురువుగారూ! నమస్కారం! మీరు చెప్పిన విధంగానే మా అబ్బాయికి మద్రాసులో ఇంజనీరింగ్ విభాగంలోనే ప్రవేశించటం జరిగింది. అలాగే మీరు చెప్పినట్లుగానే మా అమ్మాయికి బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం లభించింది. ప్రస్తుతం నేను సెంట్రల్ గవర్నమెంట్‌లో డిప్యూటేషన్ కోసం ప్రయత్నిస్తున్నాను. ఫలితం చెప్ప ప్రార్థన.
సమా: అక్టోబర్‌లోపుగా మీకు స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ఏదో ఒక మంచి మార్పు అక్టోబర్ చివరి భాగంలో జరిగే అవకాశం వుంది.
టి.సత్యనారాయణ, గుంతకల్లు, అనంతపురం
ప్ర: వివాహం ఎపుడు జరుగుతుంది? ఉద్యోగం వస్తుందా?
సమా: వివాహ విషయంలో మీకు జాతకంలో శుక్రదోషం ఉంది. తగు శాంతి చర్యలు అవసరం. ఆకస్మికంగా జరిగే అవకాశం ఉంది. ఉద్యోగం వాయవ్య దిశలో యోగం వుంది. ఆ దిశలో ప్రయత్నించండి.
గంగుల శివాజీరావు, సంగారెడ్డి (తెలంగాణ)
ప్ర: ఆధ్యాత్మికవేత్తలుగా చెలామణి అవుతూ అత్యాచారాలు చేయటం.. ఏమిటీ విపరీతం?
సమా: అర్హత లేనివారిని అందలమెక్కిస్తే అలాగే జరుగుతాయి. అంతేకాకుండా వేషధారులను బోధగురువులను జూచి వెంటపడే వెఱ్ఱి ప్రజలు కూడా అందుకు బాధ్యులే. ప్రలోభంతో వెంటబడి ప్రమాదాల్లో చిక్కుకొనటం అవివేకం, అజ్ఞానం.
జవ్వాది శివకృష్ణ, కాకినాడ (తూ.గో.)
ప్ర: నాకు ప్రభుత్వోద్యోగం లభిస్తుందా?
సమా: మీకు స్వతంత్ర వృత్తి వ్యాపారమే యోగించి లాభించే అవకాశం ఉంది.
కె.రాజేశ్, విశాఖపట్నం - ఆంధ్ర
ప్ర: వ్యాపారం బాగాలేదు. ఇద్దరు చెల్లెళ్ళకూ వివాహం కాలేదు. డబ్బు నిలవటం లేదు. ఏం చేయాలి?
సమా: మీరిచ్చిన సంఖ్య ప్రకారం మీకు ఇనుము వ్యాపారం కాని నూనెల వ్యాపారం కాని యోగించే అవకాశం లేదు. ఇవి కాకుండా వేరే ఏదైనా వ్యాపారం ఆలోచించండి. వ్యాపారంలో లాభాలు వచ్చినా పొదుపు, ఖర్చులో అదుపూ, ఏదైనా అభివృద్ధి స్కీములో మదుపూ చేయకపోతే ఎవ్వరూ ఆర్థికంగా అభివృద్ధి పొందరు.
జాన్ డేవిడ్ వరప్రసాద్, విశాఖపట్నం, ఆంధ్ర
ప్ర: మాది స్థితిగల కుటుంబమే. ఇంజనీరింగ్ పాసయ్యాను. ఎలక్ట్రికల్ వస్తువుల వ్యాపారంలో వున్నాను. వయస్సు 28 సంవత్సరములు. ఇంట్లో వివాహం చేసుకోమని బలవంతం చేస్తన్నారు. నాకు ఇప్పుడే వివాహం చేసుకోవాలని లేదు. ఏదైనా సాధించాలని ఉంది. సలహా చెప్పండి.
సమా: అన్ని వసతులూ ఉన్నప్పుడు, వయసు కూడా తగ్గట్టుగా ఉన్నప్పుడు పెద్దలు చెప్పినప్రకారం వివాహం చేసుకోవడం మంచిది. ‘వనకాలమనందు పుట్టిన బిడ్డడు బలవంతుని చేతిలోని బాణము వంటివాడు’ అన్న పవిత్ర బైబిల్ సూక్తిని పాటించండి.
సి.హెచ్.శ్రీవాణి, నెల్లూరు, ఆంధ్ర
ప్ర: ఇల్లు కొనాలనుకుంటున్నాము. కుదరటంలేదు. మాకా యోగం ఉందా?
సమా: మీ పేరునైతే మాత్రం ఆలస్యమూ- వివాదాస్పదమూ అయ్యే అవకాశం ఉంది.
జగన్ నరేశ్, అనకాపల్లి, వైజాగ్
ప్ర: ఉద్యోగంలో స్థిరత్వం?
సమా: చేసేది ఏదైనా శ్రద్ధతో చేయండి. స్థిరత్వం అదే వస్తుంది.
ఏ.నాగరాజు, కంచరపాలెం (వైజాగ్)
ప్ర: నాకు జీవితంలో సంపాదన ఎలా ఉంటుంది. స్థిరాస్తులు కొంటానా?
సమా: మీకు స్వయంగా సంపాదించుకునే స్వార్జితమే అనుభవంలోకి రాగలదు. మధ్య వయస్సులో స్థిరాస్థులు జన్మస్థలానికి దూరంగా సంపాదించుకుంటారు.
వి.శంకరయ్య, నందికొట్కూరు (కర్నూలు)
ప్ర: ఔట్ సోర్సింగ్ ఉద్యోగం రెగ్యులర్ అవుతుందా?
సమా: మీ ప్రశ్న మీ వ్యక్తిగతం కాదు. ప్రభుత్వ విధానానికి సంబంధించిన ప్రశ్న. మీ జాతకం ప్రకారం మీకు వృత్తి స్థానం శ్రమాత్మకంగానే ఉంటుంది.
ఎ.గోపాలరావు, మైలవరం (కృష్ణా)
ప్ర: అబ్బాయి పెళ్లి కుదరటంలేదు. నాకు నా జీవితంలో మొదటినుంచీ మనశ్శాంతి లేదు. కారణం తెలియదు.
సమా: మీ అబ్బాయి వివాహాలస్యానికి కారణం చంద్రదోషం- కాలసర్పదోషం- శనిదోషాలు. స్ర్తి మూలకంగా ఆటంకాలు కలుగుతున్నాయి. మీకు సంబంధించినంత వరకు ఆత్మవిశ్వాసం లోపించటం- ఇతరులపై ఆధారపడటం- అనిశ్చిత మనస్సు కారణం- సంతోషీమాత వ్రతం చేయించండి.
కామరాజు వెంకట సుందర మహాలక్ష్మి, తెనాలి (గుంటూరు)
ప్ర: మనశ్శాంతి, వినికిడి సమస్య, సంతానం గురించి ఆవేదన కలుగుతోంది. పరిష్కారం చూపగలరు?
సమా: మనశ్శాంతి కోసం భగవద్గీతా పారాయణం నేను చెప్పిన విధంగా చేస్తూ మానసిక ప్రశాంతత కలుగుతున్నదని చెప్పినందుకు సంతోషం. వినికిడి సమస్యకు హోమియోలో కాస్టికం- బరైటా కార్బ్ బాగా పనిచేస్తాయి. బయట వాడటానికి చెవిలో ‘మూలిన్ ఆయిల్’ హోమియోలో, ‘బిల్వ తైలం’ ఆయుర్వేదంలో చెప్పారు. డాక్టర్‌గారి సలహాతో వాడండి.
కె.వి.సుబ్బారావు, తెనాలి- గుంటూరు
ప్ర: అమ్మాయి పెళ్ళి ఎపుడు?
సమా: సంఖ్య ఆమె చేత చెప్పిస్తే జవాబు చెప్పగలిగేవాణ్ణి.
కె.గోపాలరావు, బరంపురం, ఒడిస్సా
ప్ర: కుమారునికి ఉద్యోగం?
సమా: 2018 మధ్యభాగంలో స్థిరత్వం రాగలదు. స్వభావరీత్యా మరొకరి ప్రోద్బలం- సహకారం కోరేవాడు- భాగస్వామ్య వ్యాపారం ఆలోచించండి.
వడ్డె మారప్ప, బైచిగేరి (కర్నూలు)
ప్ర: ఉద్యోగ యోగం ఎపుడు?
సమా: మీకు ఉద్యోగ యోగం బలహీనం. ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్టులు ప్రయత్నించండి.
ఎమ్.రాధ, పాలకొల్లు (ప.గో.)
ప్ర: పొలం అమ్మకం ఎపుడు?
సమా: మీ పొలం అమ్మకానికి కొందరు వ్యక్తుల మూలకంగా ఆటంకాలున్నాయి. ఇంకా ఆలస్యం
ఎ.శైలజ, మిట్టమీదిపల్లి, అనంతపురం
ప్ర: మా అన్నగారైన బాలాజీ 2019లో రాజకీయాల్లో ప్రవేశిస్తే బాగుంటుందా?
సమా: ఆ సందర్భంలో- ఆ సమయంలో మీ అన్నగారు అడగవలసిన ప్రశ్న- ప్రస్తుతం అప్రస్తుతం.
పి.మాధవీలత, రాజిరెడ్డిపేట (గుంటూరు)
ప్ర: మొదటి వివాహం రద్దు- రెండవ వివాహం పరిణామాలు ఎలా వుంటాయి?
సమా: ఆ వచ్చే రెండవ వ్యక్తి జాతకం కూడా ప్రభావం చేస్తుంది. ఇప్పుడే చెప్పలేము.
కుంచం రవికుమార్, రాజమండ్రి, (తూ.గో.)
ప్ర: నేను వ్యాపారం చేస్తున్నాను. ఎలా ఉంటుంది. అప్పులు తీరతాయా?
సమా: ఏ వ్యాపారం అన్నది మీరు స్పష్టం చేయలేదు. యోగించే వ్యాపారమైతే బాగానే ఉంటుంది. ఇనుము, నూనెలు వంటివి మీకు యోగించవు.
వింజమూరి జయశ్రీ సాయిరాం, పాలకొల్లు (ప.గో.)
ప్ర: నేను రైల్వే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. నాకా యోగం వుందా?
సమా: ఉత్తర మండలం (రైల్వే)లో అవకాశం దొరుకుతుంది. ఆ దిశలో ప్రయత్నించండి.
జూకంటి సుధీర్‌కుమార్, నిజామాబాద్ (తెలంగాణ)
ప్ర: నేను విదేశంలో స్థిరపడగలనా? వివాహం ఎప్పుడు?
సమా: మీకు విదేశీ ప్రయాణ యోగం వున్నది. స్థిరపడటం తరువాత ప్రశ్న- వివాహం 2018 చివరి భాగంలో జరుగును. ర - క - ల - మ - అక్షరాలు- ఉత్తరదిశ.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................
సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్ - 500 059.

- ‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ