ఆటాపోటీ

సహనానికి పరీక్ష! (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన బ్యాట్స్‌మెన్ ఎంతో మంది ఉన్నారు. అయితే, న్యూజిలాండ్ ఆటగాడు జెఫ్ అలాట్‌ను మించిన వారు ఎవరూ ఉండరేమో. 1999లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో అతను 101 నిమిషాలు క్రీజ్‌లో నిలిచాడు. 77 బంతులు ఎదుర్కొన్నాడు. ఒక్క పరుగు కూడా చేయలేక, సున్నాకే వెనుదిరిగాడు. బౌలర్లు బౌలింగ్‌ను మరచిపోవడానికి ఇలాంటి వాళ్లు ఇద్దరుముగ్గురు ఉంటేచాలు.

ఒక పరుగు.. 4 వికెట్లు!
* అత్యంత దరిద్రంగా వనే్డ ఇంటర్నేషనల్‌లో ఒక మ్యాచ్‌ని ప్రారంభించిన రికార్డు పాకిస్తాన్ పేరు మీద ఉంది. 2015 ఫిబ్రవరి 21న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకొని కష్టాలను కొనితెచ్చుకుంది. విండీస్ తన ముందుంచిన 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇన్నింగ్స్‌ను ఆరంభించి ఒక పరుగుకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ నసీర్ జంషెద్, వెటరన్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్, హారిస్ సొహైల్‌ను జేరోమ్ టేలర్ డకౌట్ చేశాడు. అహ్మద్ షెజాద్ ఒక పరుగు చేసి, జాసన్ హోల్డింగ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. నాలుగు పరుగులకు నాలుగు వికెట్లు పోగొట్టుకొని, వనే్డల్లో దారుణంగా ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన కెనడా రికార్డును పాకిస్తాన్ తిరగరాసింది.

బాలోటెలీకి అవమానం
* నైస్ సాకర్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్టార్ ఆటగాడు మారియో బాలోటెలీకి తన హోం గ్రౌండ్‌లోనే అవమానం ఎదురైంది. చాంపియన్స్ లీగ్‌లో స్థానం సంపాదించేందుకు నపోలీతో జరిగిన మ్యాచ్‌లో బాలోటెలీ ఒక అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకున్నాడు. నైస్ తొలిగోల్ చేసినప్పుడు మ్యాచ్ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. బాలోటెలీ నిర్లక్ష్యంగా ఆడుతున్నాడంటూ అభిమానులు అతను కనిపించిన వెంటనే హేళన చేయడం మొదలుపెట్టారు. నిన్నమొన్నటి వరకూ తనను ఆకాశానికి ఎత్తేసిన వారే చీదరించుకోవడంతో సిగ్గుతో తలదించుకోక తప్పలేదు. రోజులు ఎప్పుడూ ఒకే రీతిలో ఉండవనడానికి ఇదే నిదర్శనం.

టేబుల్ ఫుట్‌బాల్..
* ఇటీవల టేబుల్ ఫుట్‌బాల్‌కు విపరీతమైన క్రేజీ ఏర్పడింది. బార్సిలోనా నుంచి పారిస్ సెయింట్ జర్మయిన్‌కు రికార్డు ధరతో తరలివెళ్లిన బ్రెజిల్ స్టార్ నేమార్, ముమ్మర ప్రాక్టీస్ అనంతరం సరదాగా తన సహచరులతో కలిసి టేబుల్ ఫుట్‌బాల్ ఆడడంతో, ఈ ఆట అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది. దీనిని ఆడే విధానం, నియమనిబంధనల గురించి తెలుసుకోవడానికి సిస్టం ముందు కూర్చొని వెతికేస్తున్న నెటిజన్ల సంఖ్య వేలు దాటి, లక్షల సంఖ్యలోకి చేరిందట. స్టార్లు ఏం చేసినా గొప్పే!

- సత్య