ఆటాపోటీ

భారత బోర్డే కీలకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంప్రదాయ ఎర్ర బంతుల స్థానంలోనే గులాబీ రంగు బంతులతో టెస్టు హోదాగల అన్ని దేశాలు దాదాపుగా అంగీకరించాయి. అయితే, చాలా డే/నైట్ టెస్టు మ్యాచ్‌లు, సిరీస్‌లను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నిర్ణయంపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఇటీవలే న్యూజిలాండ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు పింక్ బంతులతో, డే/నైట్ టెస్టు సిరీల్‌లు ఆడేందుకు సుముఖత వ్యక్తం చేసింది. దీనితో భారత్ నిర్ణయంపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా వ్యతిరేకిస్తున్న అంపైర్ డిసిషన్ రివ్యూ సిస్టం (డిఆర్‌ఎస్)కు జిందాబాద్ అన్న బిసిసిఐ ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో డే/నైట్ టెస్టులకు కూడా అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. ఇది క్రికెట్ ప్రయోజనాలను ఆశించి చేసే ప్రయత్నం కాదు.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుందనే భయంతోనేనన్నది అందరికీ తెలిసిన సత్యం. కాదంటారా?