ఉత్తర తెలంగాణ

సంస్కారం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేరెందుకు కానీ అదొక బ్యాంకు. అందులో నాకు లాకర్ ఉంది. లాకర్ అనగానే అపార్థం చేసుకోకండి. అందులో దాచిపెట్టడానికి కిలోల కొద్ది బంగారం లేదు. ఇంటి పత్రాలు తప్ప మరే విలువైన పత్రాలు లేవు. దాదాపు ఇరవై ఏండ్ల క్రితమే లాకర్ తీసుకున్నాను. రెంటు కడుతున్నాను. అందులో దాచి ఉంచడానికి ఎక్కువగా ఏమి లేకపోయినా లాకరంటూ ఉండడం మంచిదనిపించింది. ఈ పోటీ ప్రపంచంలో ముందు ముందు బ్యాంకు లాకర్ కూడా అంత ఈజీగా దొరక్కపోవచ్చు.
నా శ్రీమతి లాకర్‌లోంచి చిన్న చిన్న ఐటమ్స్ ఏవో తెమ్మని, బంధువుల పెళ్లికి మరీ బోసిగా వెళితే బగుండదని, అంగారం లాంటి బంగారం ఒంటిపై కనిపిస్తేతప్ప ఎవరూ పట్టించుకోరని, అందుకని లాకర్‌లోంచి చిన్న చిన్న కమ్మలేవో తీయడానికి బ్యాంకుకు రావలసి వచ్చింది. అరగంట గడిచాక సంబంధిత క్లర్కు నన్ను లాకర్ రూంకు పిలిచి ఫార్మాలిటీస్ పూర్తిచేసి, తనవంతు లాకరు తాళం తెరిచి, ఇక నీ పని నీవు చేసుకో అన్నట్లు వెళ్లిపోయాడు. అందులోంచి వస్తువులు తీసి, మళ్లీ తాళం వేసేంతలో టేబుల్ కింద చిందరవందరగా పడివున్న కాగితాలు, వాటి మధ్య ఒక పుస్తకంలాంటిది కనిపించింది. ఆత్రంగా తీసి చూశాను. అది మా గురువుగారు రాసిన కవితాసంపుటి వారికి మిత్రులైన బ్యాంకు ఉద్యోగికి చదవమని ఇచ్చినట్లుంది. అది చెత్త కాగితాల్లో పడి వుంది. పుస్తకం లోపలి పేజీలో రాసిన పేరుచూసి, ఎంక్వైరీ చేసి, ఆ ఉద్యోగి వద్దకు వెళ్లి, నమస్కారం చేసి, పుస్తకం చూపించాను. జ్ఞాపకముందో, లేదో అతనంగా పట్టించుకోలేదు. నా ముఖం ఎగాదిగా చూసి, మళ్లీ ఫైళ్లో తలదూర్చాడు.
‘సార్! ఇది మీకు మా గురువుగారు అభిమానంతో ఇచ్చిన పుస్తకం. ఇలా చెత్తలో పడేసే బదులు మీ ఇంద్ర భవనంలో అంటే మీ ఇంట్లో.. ఎక్కడో ఒకచోట పెట్టివుంటే బాగుండేది. తెలుగుతల్లి సంతోషించేది’ అన్నాను ఆర్తిగా.
‘ఏదో మాటవరుసకు వాళ్ల ఆసక్తికొద్ది కొందరు, ఏ బ్యాంకు లోనో ఇవ్వకపోతారని, ముందు చూపుతో మరికొందరు ఇలాంటి పుస్తకాలు మాకు ఇస్తుంటారు. అవన్నీ జమచేస్తే మా ఇల్లు నిండిపోతుంది’ విసుగ్గా. అసహనంగా’అన్నాడు, ప్రపంచంలోని బరువంతా తానే మోస్తున్నంత బాధగా.
‘పోనీ ఈ పుస్తకం నేను తీసుకోనా’ అన్నాను ఆసక్తిగా. ‘ఓ నిరంభ్యంతరంగా’ అన్నాడు ఆ ఉద్యోగి.
ఆసక్తి, సహృదయత లేని వారికి తన కవిత్వం వినిపించే దురదృష్టం కలిగించవద్దని ఆ దేవున్ని వేడుకుంటాడు కాళిదాస మహాకవి.
కొద్దిగా భాషాభిమానం, సాహిత్యం పట్ల అభిరుచి, ఆసక్తి లేనివారికి అసలు పుస్తకాలే ఇవ్వకూడదు. అంతేకాదు రచనలు చేయడం వరకు మంచిదే. ఏ పత్రికకో, రేడియోకో పంపి వస్తే వచ్చింది లేకుంటే లేదనుకుంటే ఎంతోతృప్తి.
పైరవీలతో పైరవిని క్రిందికి దించగల శక్తి, సత్తా ఉన్నవాళ్లు పుస్తకాలు ప్రచురించనవచ్చు. హాట్ హాట్ కేకుల్లా అమ్ముకోనువచ్చు. ఆ శక్తి లేని వారికి ఈ ఖర్చు ఒకరకంగా తలకుమించిన భారమే. పుస్తకాలు ప్రచురించామన్న తృప్తితో పాటు ఇలాంటి చేదు అనుభవాలు కూడా ఎదుర్కోకతప్పదు.
ఇక తెలుగు భాష, తెలుగు భాష అని గగ్గోలు పెట్టినంత మాత్రాన తెలుగు భాషకు ఒరిగేదేమీ లేదు. అయినా తెలుగు ఒక సజీవభాష. దానినెవరు భుజాలపై నెత్తుకొని మోయనవసరం లేదు. ఉన్నత వర్గాలు తెలుగు భాషను మరిచిపోయినా మామూలు ప్రజలు మాట్లాడుతున్నంతవరకు తెలుగు భాష బ్రతుక్కేం ఢోకాలేదు. తెలుగు భాషా రాజకీయం అనవసరం.

- గరిశకుర్తి రాజేంద్ర, కామారెడ్డి, సెల్.నం.9493702652