విశాఖపట్నం

దేశ భాషలందు తెలుగు లెస్స సంకలన గ్రంథం (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు భాష అనే వనంలో ప్రభవించిన

సుమధుర కుసుమాలను ఎంతో

జాగరూకతతో అనేక వ్యయ ప్రయాలకోర్చి

దానిని ఒక మాలగా కూర్చిన ప్రతిభాశాలి

సీతారామ చిదంబర శాస్ర్తీకి తెలుగు

భాషాభిమానులు ముఖ్యంగా

మాతృభాషలో మాతృభాష గొప్పదనాన్ని

కీర్తిస్తూ వచ్చిన కవితా కుసుమాల్ని

చదవాలనుకునే అభిలాష గలవారంతా శత

సహస్రకోటి వందనాలర్పించాలి.

అమ్మభాషపై వెలువడిన 240 కవితా

సుమాల్ని ఒక దగ్గరకి చేర్చి, తొలి తెలుగు

అనే అనుబంధంలోని ఉపశీర్షికలో

మొట్టమొదటి సారిగా తెలుగులో కవిత

ఎవరు రాశారు? మొదలుకొని తెలుగు

సారస్వతానికి తొలి మాతృ పదార్చన

గావించిన ప్రాత:స్మరణీయుల పట్టికను

ఒకచోట పొందుపరచుట నిజంగా

ప్రశంసనీయం. అనుబంధం రెండులో

ప్రముఖ ఆధునిక ఆంధ్ర కవుల జనన

మరణాల తేదీలను పొందుపరిచారు. ఈ

గ్రంథ రాజము భాషాభిమానులకే కాదు

తెలుగు భాషను ఐచ్చికంగా ఎంచుకుని

పోటీ పరీక్షలు రాయగోరు ఉద్యోగార్థులకు

కూడా ఎంతో ఉపయోగపడుతుంది. దీని

వెల అమూల్యం. దీని ప్రాప్తిస్థానం డాక్టర్

సర్వా సీతారామ చిదంబర శాస్ర్తీ, తెలుగు

విభాగాధిపతి, శ్రీమతి గెంటెల శకుంతలమ్మ

కళాశాల, జగ్గయ్యపేట. చరవాణి

9885383741.

- మండా శ్రీ్ధర్, శ్రీకాకుళం. సెల్ : 9493309030.