రాశిఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: 
బహుళ త్రయోదశి రా.10.51
నక్షత్రం: 
పూర్వాషాఢ సా.6.26
వర్జ్యం: 
రా.2.25 నుండి 4.01 వరకు
దుర్ముహూర్తం: 
ఉ.06.00 నుండి 07.36
రాహు కాలం: 
ఉ.9.00 నుండి 10.30
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) అనుకోకుండా కుటుంబంలో కలహాలేర్పడే అవకాశముంటుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్తపడుట మంచిది. మనస్తాపానికి గురి అవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించుట మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) బంధు మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ప్రయాణాలవల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని అనుభవిస్తారు.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశే్లష) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. సహనం వహించుట అన్ని విధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. అనవసర ధనవ్యయంతో ఋణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. ఋణవిముక్తి లభిస్తుంది.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) ఋణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. అనారోగ్యమేర్పడకుండా జాగ్రత్త అవసరం.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభముంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.,) స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా నుండుట మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనంవల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసికాందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా నుండుట మంచిది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం.
కుంభం: 
(్ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందుల అధిగమిస్తారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) తలచిన కార్యాలన్నియు విజయవంతంగా పూర్తిచేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలుండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా వుంటాయి.
Date: 
Saturday, February 6, 2016
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి