ఫోకస్

పాత విధానానే్న కొనసాగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోని ఉద్యోగుల కోసం రూపొందించిన సిపిఎస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం లేనప్పటికీ గత పాలకుల తొందరపాటు చర్యల వలన ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోవాల్సి వస్తోంది. సుప్రీంకోర్టు సైతం పింఛన్ ఇవ్వడం సరైన పద్ధతని వ్యాఖ్యానించినప్పటికీ ప్రభుత్వాల్లో కదలిక రావడం లేదు. ఏపి ప్రభుత్వం మాత్రం సానుకూలంగా వ్యవహరిస్తుందనే నమ్మకం మాకుంది. ఇప్పటికే ఈ పథకం వలన రాష్ట్రంలోని లక్షలాది ఉద్యోగులకు ఎంత నష్టమో వివరించాం. పాత పింఛన్ విధానంలో ఉద్యోగ విరమణ అనంతరం సామాజిక, ఆర్థిక భద్రత అందించేలా ఉండేది, కానీ ఈ కొత్త సిపిఎస్ విధానంలో విరమణ చేసిన ఉద్యోగులకు ఎటువంటి ఆధారం ఉండదు. ఉద్యోగి మరణిస్తే అందే సహాయంలోనూ కోత పెట్టడం విచారకరం. ఏళ్ల తరబడి ఉద్యోగం చేసి వృద్ధాప్యంలో ఉద్యోగుల్ని ఇలా వదిలేయడం సరికాదు. పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలు సిపిఎస్ అమలును వ్యతిరేకించాయి. ఇతర రాష్ట్రాలు కూడా వాటి పక్కన చేరి ఉద్యోగులకు భరోసా కల్పించాలి. కేవలం పాత పింఛన్ విధానానే్న పునరుద్ధరించాలనే ప్రధాన డిమాండ్‌తో ఇటీవల విజయవాడలో ఉద్యమించాం. రాబోయే రోజుల్లో ఈ సి పి ఎస్ విధానం వలన కలిగే నష్టాలను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వివరించి వారిని కూడా ముప్పు నుంచి తప్పించాలనే భావనతో దేశ వ్యాప్త ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టే ఆలోచనలో ఉద్యోగ సంఘాలన్నీ ఉన్నాయి. అయితే ఈలోగానే ప్రభుత్వం ఏదో ఒక విధంగా ఈ విధానంలో మార్పులు తీసుకువస్తుందనే ఆశతో ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.

- బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు