ఫోకస్

రద్దుకు కేంద్రంపై ఒత్తిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు నష్టదాయకమైందని సిపిఎస్ రద్ధుకు, పాత పింఛన్ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో వచ్చే శాసన మండలి సమావేశాల్లో తీర్మానం సైతం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తాం. సిపిఎస్ రద్దు కోరుతూ ఇప్పటికే గత మండలి సమావేశాల్లోనూ రెండు పర్యాయాలు గళమెత్తడం జరిగింది. టిఆర్‌ఎస్‌కు చెందిన ఏడుగురు ఎంపీల బృందంతో, 500మంది ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రతినిధులతో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించడంతో పాటు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి వినతి పత్రాన్ని అందించి సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. కలెక్టరేట్‌ల ముందు ధర్నాలు సైతం నిర్వహించాం. 1-9-2004 తర్వాత నియమించబడిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రవేశ పెట్టిన సిపిఎస్ పింఛన్ పథకంలో భాగంగా ప్రతినెల వేతనాల నుండి 10శాతం మినహాయింపు చేసి అంతే మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కలిపి షేర్ మార్కెట్‌లలో, ఇతర ఆర్థిక సంస్థల్లో మదుపు చేసి ఉద్యోగ విరమణ చేసిన పిదప సదరు మొత్తాలను కొత్త పెన్షన్ విధానంలో చెల్లిస్తారు. ఈ పద్ధతిలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉద్యోగ విరమణ పిదప పించన్ భరోసా లేకపోవడంతో పెద్ద వయసులో కుటుంబ బాధ్యతలు తీర్చలేక, ఆదాయ వనరులు లేక వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుంది. రాష్ట్రంలో 1లక్ష 20వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు సిపిఎస్ విధానంతో పించన్ లేక పదవి విరమణ తర్వాత తమ కుటుంబాల సామాజిక భద్రతపై ఆందోళన చెందుతున్నారు. సిపిఎస్ విధానంలో ఫండ్ మేనేజర్లకు విధిగా నిధులు జమ చేయబడుతున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులకు మాత్రం ఉద్యోగ విరమణ అనంతరం పించన్ చెల్లింపు లేదు. పించన్ పొందడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి హక్కు అని సుప్రీం కోర్టు సైతం 1982లో తీర్పునిచ్చింది. వాస్తవంగా దేశంలో పెరిగిన నిరుద్యోగ సమస్య, ఉద్యోగ సాధనలో తీవ్రమైన పోటీతో ఆలస్యంగా 35ఏళ్లకు పైబడిన మీదటనే ఉద్యోగాల్లో చేరుతున్నారు. దీంతో వారికి సగటున 20ఏళ్ల సర్వీసు మాత్రమే ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి పాత పించన్ విధానం అమలు చేయడం ద్వారా గతంలో మాదిరిగా పెద్దగా ఆర్థిక భారం సైతం ఉండబోదు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాల సంక్షేమాన్ని, భద్రతను దృష్టిలో పెట్టుకుని సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి గతంలో అమలుచేసిన పాత పింన్ విధానాన్ని కొనసాగించాలన్న డిమాండ్ సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి కొనసాగిస్తాం.

- పూల రవీందర్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ