ఫోకస్

మహోద్యమంగా మారబోతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు ఆందోళన ఆగదు. దేశవ్యాప్తంగా 56 లక్షల మంది ఉద్యోగులు సిపిఎస్ పరిధిలోకి ఉన్నారు. ఇన్ని లక్షల మంది ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా స్పందించడం లేదు. ఉద్యోగులు చేస్తున్న ఉద్యమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తేలికగా తీసుకుంటే తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. సిపిఎస్ విధానాన్ని అమలులోకి వచ్చినప్పటి నుంచే ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా ప్రభుత్వాలు పెడచెవిన పెట్టడంవల్ల రిటైర్డు ఉద్యోగులతోపాటు సర్వీసులో ఉండి చనిపోయినవారి కుటుంబాలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పటివరకు సిపిఎస్ పరిధిలోకి వచ్చిన ఉద్యోగులు 262 మంది చనిపోగా, వెయ్యిమంది రిటైరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఎస్ పరిధిలో లక్ష 65 వేల మంది, తెలంగాణలో లక్ష 25 వేల 572 మంది ఉద్యోగులు ఉన్నారు. సిపిఎస్ రద్దు అంశం తమ పరిధిలో లేదని రాష్ట్ర ప్రభుత్వాల వాదనలో ఎంతమాత్రం వాస్తవం లేదు. కేంద్రానికి ఒక్క లేఖ రాసి తాము దీంట్లో నుంచి తప్పుకుంటున్నామని చెబితే సరిపోతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల ఆందోళన పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. సిపిఎస్ విధానం వల్ల ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఉద్యోగుల నుంచి వసూలు చేసిన డబ్బునే షేర్ మార్కెట్‌లో పెట్టి వాటిపై వచ్చే లాభాలతోనే పెన్షన్ చెల్లించడమనేది దారుణం. షేర్ మార్కెట్‌వల్ల నష్టపోతే ఉద్యోగికి నయా పైసా రాదు. పైగా ఈ విధానంలో రిటైర్డు అయిన ఉద్యోగికి 70 సంవత్సరాల వరకే పెన్షన్ వస్తుంది. రిటైర్డు అయిన ఉద్యోగి చనిపోయినా, సర్వీసులోనే చనిపోయినా ఈ విధానంవల్ల నయా పైసా రాదు. అశాస్ర్తియమైన సిపిఎస్ విధానాన్ని రద్దు చేసేదాకా ఉద్యమాన్ని విరమించేది లేదు. ఇది మున్ముందు మహోద్యోమంగా మారబోతుందన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు.

- స్థితప్రజ్ఞ, అధ్యక్షుడు, తెలంగాణ స్టేట్ సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్