ఫోకస్

సిబ్బందికి శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించే పెన్షన్ అనేది బిక్షకాదు. ‘పెన్షన్ బిక్ష కాదు.. ఉద్యోగి ప్రాథమిక హక్కు’ అనే నినాదంతో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు దశలవారీగా ఆందోళన బాట పట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కొత్తగా చేపట్టిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సిపిఎస్)ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. ఈ నెల 1న తెలంగాణలోని మొత్తం 1.20 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు సామూహిక సెలవులు పెట్టి జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేశారు. ఈ కొత్త సిపిఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 32 శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంతో ఉద్యోగులు సామాజిక భద్రతను కోల్పోతారని భయపడుతున్నారు. వారు భయపడడానికి బలమైన కారణం ఉంది. ఒక ఉద్యోగి తాను ఉద్యోగం చేసినంత కాలం తన వేతనంలోని కొంత భాగాన్ని పెన్షన్‌కోసం జమ చేయడం జరుగుతుంది. మిగతా భాగాన్ని ప్రభుత్వం తన వాటాగా ఆ ఉద్యోగి పేరిట ఉన్న పెన్షన్ ఖాతాలో జమ చేస్తుంది. గడచిన దశాబ్దాలుగా ఈ పద్ధతి కొనసాగుతున్నది. దీనివల్ల సదరు ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత మిగతా శేష జీవితాన్ని పూర్తిగా పెన్షన్‌తో, ఎవరిపైనా ఆధారపడకుండా జీవించడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు కొత్తగా కాంట్రీబ్యూటరీ పెన్షన్ విధానంతో పదవీ విరమణ చేసిన ఉద్యోగికి భవిష్యత్తుపై భరోసా లేకుండా చేస్తుంది. కేంద్రం పెన్షన్ నిధి నియంత్రణ అభివృద్ధి సంస్థ (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ) అనే పేరిట ఒక స్వతంత్య్ర స్వయం ప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేసి దానిద్వారా పెన్షన్ లావాదేవీలను కొనసాగించడానికి నిర్ణయించింది. ఈ సంస్థను ఏర్పాటు చేయడంతో ఉద్యోగుల పెన్షన్ విషయానికి వస్తే ఇకనుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి సంబంధం ఉండదు. ఒక ఉద్యగి పదవీ విరమణ చేసిన తర్వాత ఇంత వరకు తన పెన్షన్ ఖాతాలో జమ అయిన పూర్తి పెన్షన్ పొందేవారు. కానీ కొత్తగా తెచ్చిన కాంట్రీబ్యూటరీ పెన్షన్ విధానంతో ఇకనుంచి తనకు రావాల్సిన పూర్తి పెన్షన్ నుంచి కేవలం 60 శాతం వరకే పొందగలుగుతారు. మిగతా 40 శాతం పెన్షన్‌ను ఈ సంస్థ పెన్షన్‌దారుల అనుమతి లేకుండానే వివిధ సంస్థలకు వాటాలుగా జమ చేస్తుంది. ఆ సంస్థలు లాభాలు పొందినప్పుడే ఆ ఉద్యోగికి తన 40 శాతం పెన్షన్ వాటాలను చెల్లిస్తాయి. థర్డ్ పార్టీగా ఏర్పాటు చేసిన ఈ అథారిటికీ పెన్షన్ విషయంలో సర్వాధికారాలను కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టి చేతులు దులుపుకుంది. ఈ కొత్త విధానాన్ని రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఉద్యోగుల భవిష్యత్తుకు శాపంగా మారిన ఈ కొత్త విధానాన్ని వారు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆందోళన బాట చేపట్టారు. అయితే ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడంతో రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవన్న సంకేతాన్ని ప్రభుత్వం ఇవ్వదలచుకుందేమో కానీ ఇప్పటికిప్పుడు మాత్రం ఈ కొత్త విధానం ఉద్యోగులకు శాపంగా మారింది. ఉద్యోగుల ఉసురు పోసుకోవద్దని సూచిస్తున్నాం.

- కనుకుల జనార్థన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, చైర్మన్, టి.పిసిసి సేవాదళ్