ఫోకస్

లోపాలుంటే సవరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానం రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతోంది. 2004 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను అమల్లోకి తీసుకువచ్చింది. దీనిని న్యూ పెన్షన్ స్కీమ్‌గా చెబుతున్నారు. ఈ విధానాన్ని అప్పటి అధికార, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బిజెపి పార్లమెంట్‌లో ఆమోదించాయి. అంతకుముందు ఈ బిల్లు తీసుకురావాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం భావించినప్పటికీ పార్లమెంట్‌లో వామపక్షాల సంఖ్య అధికంగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. అయితే ఈ సిపిఎస్ విధానాన్ని దేశంలో 19 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా సిపిఎస్ విధానంవల్ల ఉద్యోగులు ఎక్కువగా నష్టపోతున్నారనే ఆందోళనలో ఎక్కువమంది ఉద్యోగులున్నారు. ఎందుకంటే సిపిఎస్ విధానంలో ఉద్యోగి వాటా కింద జీతంలో 10 శాతం, కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం కలిపి వచ్చే మొత్తాన్ని స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి కింద జమచేస్తామని చెబుతున్నాయి. దీనిని ఉద్యోగ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. స్టాక్ మార్కెట్‌లో పెడితే తమకు ఎంత పించన్ వస్తుందన్నదీ తెలియని పరిస్థితి ఉంది. కనుక ఆ విధానం వద్దని పాత పించన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నాయి. అయితే నేడు ప్రపంచంలో వివిధ దేశాలు ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు అనేక విధానాలను అమలు చేస్తున్నాయి. ఆ విధానాల అమల్లో లోపాలుంటే సరిచేసుకోవాలే తప్ప, ఆ విధానాన్ని విడిచిపెట్టడం సరికాదు. సిపిఎస్ విధానంలో లోపాలుంటే వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. సామాజిక భద్రత అన్నదీ అవసరమే.

- పి.అశోక్ గజపతిరాజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి