ఫోకస్

రిటైరైనవారికి భద్రత కరవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర, రాష్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వ్యక్తులు, వారి కుటుంబాలు కాంట్రిబ్యూటీరీ పెన్షన్ స్కీం (సిపిఎస్) విధానంపై ఆందోళనకు గురవుతున్నారు. అందుకే వారు ఉద్యమించి సెప్టెంబర్ 1వ తేదీన తెలంగాణలో సమ్మె చేశారు. ప్రభుత్వ అస్పష్ట విధానాలు, ఉద్యోగులకు భద్రత కల్పించే విధంగా సిపిఎస్ రూపకల్పన చేయనందువల్ల పదవీ విరమణ చేసిన తర్వాత వారి కుటుంబాలు ఇబ్బందులు పడతాయ. సిపిఎస్ విధానం లోపభూయిష్టంగా ఉందని టిడిపి భావిస్తోంది. ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. ఉద్యోగుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వాలు ఇలాగే వెళ్తే పెద్దఎత్తున తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులతో చర్చించాలి. నిజాయితీగా సేవలు అందించిన ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత పెన్షన్లపై ఆధారపడాల్సి ఉంటుంది. ప్రమాదంలో మరణించిన ఉద్యోగులు కుటుంబాలు కూడా పెన్షన్‌లపై ఆధారపడాలి. ఉద్యోగులకు భద్రత కల్పించే విధంగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 2004 సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అమల్లోకి తెచ్చారు. అదికాస్తా నో పెన్షన్ స్కీమ్‌గా మారిపోయింది. ప్రావిడెంట్ ఫండ్ సదుపాయం ఉండేది. ఇలా ఎన్నో సదుపాయాలతో సామాజిక భద్రత ఉంటుందనే నమ్మకం పాత పెన్షన్‌లో ఉండేది. సిపిఎస్ విధానంలో సామాజిక భద్రత లేకుండా పోయింది. 1982లో సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులకు సామాజిక భద్రత ఉండాలని తీర్పు చెప్పింది. సిపిఎస్ విధానంవల్ల 56 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, లక్షా 25వేల మంది తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు నష్టపోతున్నారు. భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని చూస్తున్నాయ. తెలంగాణలో సిపిఎస్ విధానంలో చేరిన ఉద్యోగుల్లో వెయ్యి మందికిపైగా పదవీ విరమణ చేయగా, 200 మందికిపైగా చనిపోయారు. వీరికి ఎలాంటి ఆర్థిక సహకారం అందక నష్టపోతూ వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. సిపిఎస్ విధానంలో ఉద్యోగి వేతనంలో 10 శాతానికి ప్రభుత్వం, 10 శాతం కలిపి పెన్షన్ పథకంలో జమచేస్తుంది. పదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగి పదవీ విరమణ సమయంలో జమ చేసిన మొత్తంలో 60 శాతం తిరిగి చెల్లిస్తారు. మిగిలిన 40 శాతం మొత్తాన్ని పెన్షన్ విధానంలో జమ చేస్తారు. ఈ మొత్తాన్ని అందుబాటులో ఉన్న వివిధ పెన్షన్ పథకాల్లో పెట్టుబడి పెట్టి దానిపై వచ్చే రాబడి ఆధారంగా పెన్షన్ చెల్లిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ విధానాన్ని అర్థం చేసుకోలేక అయోమయంలో పడి రకరకాల కారణాలతో ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు. ఉద్యోగులను రోడ్ల పాలుచేయకుండా సిపిఎస్ విధానాన్ని కూలంకషంగా పరిశీలించి ఉద్యోగులకు భద్రత కల్పించే విధంగా అమలు చేయాలి. లేదంటే పాతపెన్షన్ విధానానే్న అమలు చేయాలి.

- ఎల్ రమణ, తెలంగాణ టిడిపి అధ్యక్షుడు