ఫోకస్

భద్రత ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తికి ప్రధానమైన కారణం. రిటైర్‌మెంట్ తరువాత కూడా ఉండే పెన్షన్ భద్రత. జీవిత కాలమంతా ప్రభుత్వ ఉద్యోగిగా సేవ చేసి రిటైర్ అయిన తరువాత కనీస భద్రత కోరుకోవడం తప్పుకాదు. గతంలో అమలులో ఉన్న కుటుంబ పెన్షన్ స్థానంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనిపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం భారం తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తోంది. ఇది భారం కాదు రిటైర్డ్ అయిన వారి జీవితానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కొత్త విధానం అమలు చేసేప్పుడు ఉద్యోగులకు నష్టం కలగకుండా చూడాలి. ఉద్యోగులకు భద్రత కలిగించే విధంగా సిపిఎస్ విధానం రూపొందించలేదు అనే అభిప్రాయం ఉద్యోగుల్లో ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల ఆందోళనను అర్థం చేసుకోవాలి. సమస్యపై దృష్టి సారించాలి. తమ హక్కులను కాలరాస్తున్నారు, తమ రిటైర్‌మెంట్ జీవితానికి భద్రత లేదు అనే ఆందోళన ఉద్యోగుల్లో లేకుండా చూడాలి. 2004 సెప్టెంబర్ 1 తేదీ తరువాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి ఈ కొత్త విధానం అమలు అవుతుంది. అప్పటి వరకు అమలు చేసిన విధానం ఉద్యోగులకు మేలుచేసే విధంగా ఉండేది. ఉద్యోగంలో చేరిన ఏడాదిలో మరణించిన ఉద్యోగుల కుటుంబానికి కూడా పెన్షన్ లభించేది. ఇప్పటి విధానంలో అలాంటి సౌకర్యం లేదు. వారి పరిస్థితి ఏం కావాలి. పాత పెన్షన్ విధానంలో పదవీ విరమణ తరువాత డిఏ పెరిగితే పెన్షన్‌కు కలిసేది. కొత్త విధానంలో ఇది లేదు. పెన్షన్ అనేది సామాజిక భద్రత పథకం లాంటిది. కొత్త విధానంలో ఇది లేదు. సిసిఎస్ విధానం రాష్ట్రాల పరిధిలోనే ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులకు నష్టం కలుగకుండా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలి.

- దేవి లక్కరాజు, న్యాయవాది