ఫోకస్

రాష్ట్రాలకు సంబంధం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్) కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధానం. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడతాం. ఉద్యోగులు తమ వాటాగా చెల్లిస్తున్న డబ్బును మార్కెట్లో పెట్టి, ఇంకెక్కడో ఉంచి, అది ఎంత వస్తుందో తెలియకుండా, దానికి భద్రత లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అయితే సిపిఎస్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధానం. కనుక రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు ఉండవు. కేంద్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జాతీయ స్థాయిలో దీనిపై ఒక విధానాన్ని తీసుకురావాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలు చేసి.. దీనిని మార్చండి అని కేంద్రానికి పంపాయి. ఏపీలో కూడా ప్రభుత్వం ఆలోచన చేసి దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటుంది. ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవడానికి మేము అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది మా భాగస్వామ్య ప్రభుత్వమే కనుక, అన్ని విధాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి శాయశక్తులా కృషిచేస్తాం. ఇందుకోసం అసెంబ్లీలో గానీ, రానున్న కేబినెట్ సమావేశంలో గానీ చర్చించి తీర్మానం చేస్తాం. రాష్ట్రంలో ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం. రాష్ట్రం చేతిలో లేదు కనుక కేంద్రం జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

-కాలవ శ్రీనివాసులు, సమాచార, పౌర సంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖల మంత్రి, ఆంధ్రప్రదేశ్