ఫోకస్

సిపిఎస్ లాభం కాదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా సిపిఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం. గతంలో ఉద్యోగులకు ప్రభుత్వమే పింఛను మంజూరు చేసేది. 2004 సెప్టెంబర్ 22న జీవో 653 జారీ చేసింది. దాని ప్రకారం ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం అమలులోకి వచ్చింది. 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారందరికీ దీనిని వర్తింపచేసింది. కొన్ని రాష్ట్రాల్లో 2004 జనవరి 1 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి దీనిని వర్తింపచేశారు. బేసిక్ పే, డిఎపై 10 శాతం మేర ప్రతి ఉద్యోగి పించనుకు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం సమానమైన మొత్తాన్ని విరాళంగా అందిస్తుంది. ఈ మొత్తాన్ని వేర్వేరు రంగాల్లో పెట్టుబడులు పెట్టి, ఉద్యోగి పదవీ విరమణ సమయంలో ఆయన పించనుకు వినియోగిస్తారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీని (పిఎఫ్‌ఆర్‌డిఎ) ఏర్పాటు చేసింది. ఈ సంస్థ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డిఎల్)ను రికార్డుల నిర్వహణ సంస్థగా నియమించింది. అంటే ఉద్యోగులు వారి నిధుల విరాళాల వివరాలు ఎన్‌ఎస్‌డిఎల్ వద్ద నిక్షిప్తమై ఉంటాయి. ఎస్‌బిఐ, ఎల్‌ఐసి, యుటిఐల వద్ద మొత్తం సిపిఎస్‌లో 40 శాతం, 31 శాతం, 29 శాతం జమచేస్తారు. ఈ సంస్థలు ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. పదవీ విరమణ సమయానికి ఉద్యోగి ఆదా చేసిన మొత్తంలో 40 శాతం తిరిగి ఫండ్ మేనేజర్ల వద్ద మదుపు చేయాల్సి ఉంటుంది. ఆ మొత్తానికి అనుగుణంగా ఉద్యోగికి పించను మంజూరు చేస్తాయి. మిగిలిన 60 శాతం మొత్తాన్ని ఉద్యోగి చేతికి అందజేస్తారు. అయితే ఉద్యోగులు మాత్రం సిపిఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జాతీయ స్థాయిలో పెద్ద ఉద్యమమే మొదలైంది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం- కనుక దీనిని రద్దు చేయలేమని కొన్ని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ఇటీవల ప్రవేశపెట్టిన జిఎస్‌టి బిల్లును వివిధ రాష్ట్రాలు ఆమోదించిన తర్వాతనే కేంద్రం అమలులోకి తెచ్చిన చందంగానే పిఎఫ్‌ఆర్‌డిఎ బిల్లును కేంద్రం అమలుచేసింది. రాష్ట్రాలకు ఇష్టం ఉంటే ఈ పద్ధతిని అనుసరించవచ్చని కూడా పేర్కొంది. అంతేతప్ప పిఎఫ్‌ఆర్‌డిఎను తప్పనిసరి అమలుచేయాలనే నిబంధన ఎక్కడా లేదని ఉద్యోగ సంఘాల నాయకులు వాదిస్తున్నారు. ఇప్పటికీ త్రిపుర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానమే అమలులో ఉంది. సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలను కోరినపుడు కూడా ఇది కేవలం రాష్ట్రాల పరిధిలోని అంశం మాత్రమేనని కేంద్రం స్పష్టం చేసింది. సిపిఎస్ విధానం రద్దుచేస్తే ప్రభుత్వానికి పిఎఫ్‌ఆర్‌డిఎ నుండి సుమారు మూడు వేల కోట్లు వస్తాయని నెలనెలా చెల్లించే 300 కోట్ల రూపాయిలు మిగులుతాయని, 1.30 లక్షల ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కలిపి దాదాపు నాలుగు లక్షల మంది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతుగా నిలుస్తారని చెబుతున్నారు. ఇదే పరిస్థితి ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రాలోనూ ఉంది. సిపిఎస్ ప్రకారం రిటైర్మెంట్ సగటు మరో 15 సంవత్సరాలు తీసుకున్నా ఉద్యోగులు వారి రిటైర్మెంట్ 2025 తర్వాతనే మొదలవుతుందని, అప్పటికి వారు ప్రభుత్వానికి భారం కాబోరని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంపై పలువురు ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.