అంతర్జాతీయం

రక్షణ బంధం మరింత పటిష్ఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: టెక్నాలజీలో ద్వంద్వ వినియోగం సహా అన్ని రకాలుగానూ రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవాలని భారత్, జపాన్ దేశాలు బుధవారంనాడు అంగీకరించాయి. ప్రత్యేక ద్వైపాక్షిక, వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా అన్ని రకాలుగానూ సైనికపరమైన సాన్నిహిత్యాన్ని విస్తృతం చేసుకోవాలని సంకల్పించాయి. జపాన్ రక్షణ మంత్రి ఇత్స్‌నోరీ ఓనెడేరాతో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. టోక్యోలో జరుగుతున్న వార్షిక ఇండో-జపాన్ రక్షణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో యుఎస్-2 విమానాల కొనుగోలు అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని ఓ సంయుక్త ప్రకటనలో ఇరు దేశాల నేతలు తెలిపారు. ఉత్తర కొరియా తాజాగా జరిపిన అణుపరీక్ష, దక్షిణ చైనా మహాసముద్ర ప్రాంతంలో జరుగుతున్న చైనా ప్రాబల్యం నేపథ్యంలో భారత్-జపాన్‌లు రక్షణ బంధాన్ని పటిష్టం చేసుకోవాలని నిర్ణయించడం అంతర్జాతీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. రోబోటిక్స్, యుజి వాహనాలకు సంబంధించి జరిగే పరిశోధనలకు సంబంధించి సాంకేతికపరమైన చర్చలు ప్రారంభించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత నౌకాదళం కోసం యుఏ-2 షినే్మవా అనే యుద్ధ విమానాన్ని జపాన్ నుంచి కొనుగోలు చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. తక్కువ ధరకే ఆయుధాలను భారత్‌కు విక్రయించాలని జపాన్ చేసిన ప్రయత్నాల పట్ల చైనా ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్త చేసిన విషయం తెలిసిందే. ఇటువంటి ప్రయత్నం ఎంతమాత్రం హర్షణీయం కాదని కూడా తెలిపింది. ఇదిలావుండగా, ఉగ్రవాద నిరోధనతోపాటు నౌకాదళాల్లో కూడా సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలని పదాతిదళాలకు సంబంధించి కూడా పరస్పర సహకారాన్ని ఇనుమడించుకోవాలని భారత్-జపాన్ తాజాగా నిర్ణయించాయి. జపాన్-్భరత్ ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యంలో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆ ప్రకటన తెలిపింది.