అంతర్జాతీయం

మైన్మార్‌కు భారత్ అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నే పీ ట, సెప్టెంబర్ 6: మైన్మార్ ఐక్యతను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృతనిశ్చయంతో పనిచేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా రోహింగ్యా వ్యవహారంలో చెలరేగుతున్న హింసాకాండ పట్ల భారత్ తీవ్ర ఆందోళన చెందుతోందని పేర్కొన్న మోదీ ‘మైన్మార్ ఐక్యత, ప్రాదేశిక సమగ్రత పరిరక్షణకు కృషి చేస్తాం’ అని స్పష్టం చేశారు. మైన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలు, స్టేట్ కౌన్సిలర్ అంగ్‌సాన్ సూకీతో మోదీ విస్తృతంగా చర్చలు జరిపారు. లక్షా 25వేల మంది రోహింగ్యా శరణార్థుల వ్యవహరంలో సూకీ సారధ్యంలోని మైన్మార్ ప్రభుత్వం అంతర్జాతీయ వత్తిళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మోదీ జరిపిన తాజా చర్చలకు మరింత ప్రాధాన్యత చేకూరింది. కేవలం రెండువారాల్లోనే రఖీనా రాష్ట్రంలో సైనిక దాడులు తాళలేక వేలాది మంది రోహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్‌కు పరుగులు పెట్టడం అంతర్జాతీయంగా తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. మోదీ, సూకీ చర్చల అనంతరం ఓ సంయుక్త పత్రికా ప్రకటన విడుదలైంది. రఖీనా రాష్ట్రంలో ఉగ్రవాద హింసాకాండ పట్ల మైన్మార్ ప్రభుత్వ ఆందోళనను భారత్ అర్థం చేసుకుంటుందని ఆ ప్రకటనలో మోదీ తెలిపారు. ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని అదే క్రమంలో మైన్మార్ ఐక్యతను ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. కాగా మైన్మార్‌కు ఎదురవుతున్న ఉగ్రవాద ముప్పుపట్ల భారత్ బలమైన వైఖరిని అవలంబించడం పట్ల సూకీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్-మైన్మార్‌లు చేతులు కలిపితే ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టవచ్చని అన్నారు. మైన్మార్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని మోదీ ఆ దేశ అధినేత్రి అంగ్‌సాన్ సూకీకి ఓ అరుదైన బహుమతి అందించారు. 1986లో ఫెలోషిప్ కోసం సూకీ సమర్పించిన పరిశోధన ప్రతిపాదన ప్రత్యేక ఒరిజనల్ కాపీని ఆమెకు బహూకరించారు. సిమ్లాలోని ఐఐఎఎస్ ఫెలోషిప్ కోసం సూకీ ఈ పరిశోధన పత్రం అందించారు.
చిత్రం.. మైన్మార్ పర్యటనలో భాగంగా సూకీతో మోదీ