రాష్ట్రీయం

ప్రజలంటే చులకనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్/మహేశ్వరం, సెప్టెంబర్ 6: ఎంతోమంది ఆత్మబలిదానాలు చేసి తెలంగాణకు విమోచన కల్పిస్తే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కె. చంద్రశేఖర్ రావు తన స్వార్ధ రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల స్వాతంత్య్రాన్ని హరిస్తున్నారని బిజెపి జాతీయ నేత, కేంద్ర ఆహార ఉత్పత్తి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి మండిపడ్డారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బిజెపి రాష్టశ్రాఖ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ చేపట్టిన తెలంగాణ విమోచన యాత్ర బుధవారం మహేశ్వరం, మేడ్చల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆమె మాట్లాడారు. తెలంగాణలో నిజాం నవాబు నిరంకుశ పాలనను సర్ధార్ వల్లభాయ్‌పటేల్ అణచి వేసి స్వాతంత్రం తెచ్చారని సాధ్వి నిరంజన్ జ్యోతి గుర్తుచేశారు. త్యాగాలకు నిలయమైన తెలంగాణలో విమోచనదినాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తేవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారని, ప్రజలు ప్రభుత్వం మెడలు వంచి తగిన రీతిలో బుద్ది చెబుతారని అన్నారు. కేంద్రం సహాయం చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం నిద్ర మత్తులో ఉందని విమర్శించారు. తెలంగాణ చరిత్రను త్యాగాలను సిఎం కెసిఆర్ వక్రీకరిస్తున్నారని విమర్శించారు. త్యాగాలను విస్మరించడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపర్చడమేనని దుయ్యబట్టారు. ప్రస్తుతం కెసిఆర్‌పై ప్రజల్లో భ్రమలు తొలగిపోతున్నాయని, ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారన్నారు. స్వాతంత్య్రం లభించిన తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏమేరకు నిధులు విడుదల చేసిందో, బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడేళ్ళలో అంతకంటే ఎక్కువ విడుదల చేసిందని, దమ్ముంటే చర్చకు రావాలని టి.కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. రైతు సమితిల పేరుతో గ్రామ సంఘాలను టిఆర్‌ఎస్ కమిటీలుగా మారుస్తూ రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతన్నారని ధ్వజమెత్తారు. రైతు సమితిల్లో పది శాతం రైతులుంటే 90 శాతం టిఆర్‌ఎస్ శ్రేణులే ఉన్నారని ఆరోపించారు. అధికార యంత్రాంగం కూడా దీనిపై అవేదన చెందుతుందన్నారు. తమ యాత్రను అడుగడుగునా అడ్డుకోవాలని చూస్తున్నా, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబించే రీతిలో బతుకమ్మ, బోనాలతో మహిళలు యాత్రకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి, ధూంధాంలతో హోరెత్తించారు. భారీగా బిజెపి శ్రేణులు కార్యక్రమానికి హజరుకావడంతో వేదికపై పెద్దఎత్తున సందడి నెలకొంది. స్థానిక బిజెపి నాయకులు కేంద్ర సహాయమంత్రిని, లక్ష్మణ్‌ను గజమాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు.
చిత్రం.. తెలంగాణ విమోచన యాత్ర వేదికపై మాట్లాడుతున్న కేంద్ర సహాయమంత్రి సాధ్వినిరంజన్ జ్యోతి