రాష్ట్రీయం

జనవరి 1 నుంచి ఇంటింటికీ తాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: నూతన సంవత్సరం కానుకగా మిషన్ భగీరథ పథకం ద్వారా జనవరి 1నుంచి ఇంటింటికీ తాగు నీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మిషన్ భగీరథ పథకం పురోగతిపై మంత్రులు సమీక్షించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాలోని శాసనమండలి చీఫ్ విప్ పాతూరి సుథాకర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ డిసెంబర్‌లోగా మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, సమస్యలు ఏమైనా ఎదురైతే తక్షణం తమ దృష్టికి తీసుకురావాలని మంత్రులు సూచించారు. ఈ ప్రాజెక్టు సిఎం కెసిఆర్ కల అని, అది నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అధికారులు మిషన్ భగీరథ పనులను సవాల్‌గా తీసుకుని గడువులోగా పూర్తి చేయాలని కోరారు. అలాగే వాటర్ గ్రిడ్ పథకంపై అసెంబ్లీ నియోజకవర్గంవారీగా పనుల పురోగతిపై సమీక్షించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న పనుల పట్ల మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6,028 కిలోమీటర్ల మేరకు పైప్‌లైన్లు వేయాలని లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 3,800 కిలోమీటర్ల వరకు పైప్‌లైన్ పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.