రాష్ట్రీయం

జల విద్యుత్ ఢమాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల జలాశయాల్లో నీటి మట్టం గణనీయంగా పడిపోవడంతో ఈ ఏడాది జల విద్యుదుత్పాదన పూర్తిగా తగ్గిపోయింది. ఒక్క జూరాల విద్యుత్ ప్రాజెక్టు నుంచి మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఈ ఏడాది వరద నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోవడం, ఎగువ రాష్ట్రాల నుంచి ఆశించిన స్ధాయిలో నీటి విడుదల లేకపోవడంతో జల విద్యుదుత్పత్తి పూర్తిగా అంచనాలు తప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో జల విద్యుత్ సామర్థ్యం 2351.8 మెగావాట్లు. ఇందులో ప్రియదర్శిని జూరాల నుంచి 234 మెగావాట్లకు కేవలం సగటున 3.43 ఎంయు విద్యుత్, లోయర్ జూరాల నుంచి 240 మెగావాట్లకు 2.09 ఎంయు విద్యుదుత్పత్తి అవుతోంది. ఈ వారంలో మొత్తం 20.38 ఎంయు జల విద్యుదుత్పత్తి అయింది. తెలంగాణ పరిధిలో శ్రీశైలం ఎడమ గట్టు పవర్ హౌజ్ కెపాసిటీ 900 మెగావాట్లు. ఇక్కడి నుంచి జల విద్యుత్ లేదు. నాగార్జునసాగర్ వద్ద 815 మెగావాట్ల జల విద్యుత్ పవర్ హౌస్ ఉంది. ఇక్కడి నుంచీ విద్యుదుత్పత్తి లేదు. రాష్ట్రంలోని జల విద్యుత్‌లో ఈ రెండు ప్రాజెక్టులు 80 శాతం ఉత్పత్తి చేస్తాయి. పులిచింతలలో 30 మెగావాట్లు, సింగూరులో 15 మెగావాట్లు, నిజాంసాగర్‌లో 10 మెగావాట్ల సామర్థ్యం ఉన్నా, నీటి ప్రవాహం లేకపోవడంతో విద్యుదుత్పత్తి లేదు. ఆల్మట్టి డ్యాం ఎత్తును 1690 అడుగుల నుంచి 1705 అడుగులకు పెంచడం వల్ల తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు నీటి ప్రవాహం పూర్తిగా పడిపోయింది. గత వారం రోజులు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాల వల్ల డ్యాం నిండి ఉండటంతో రోజకు 40 వేల క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేశారు. ఈ ప్రవాహం వల్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పరిస్ధితి లేదు. జూరాల మీదుగా నీటి ప్రవాహం శ్రీశైలంకు వస్తున్నందున, జూరాల పరిధిలో ఒక్కటే జల విద్యుదుత్పత్తి అవుతున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. జల విద్యుత్ ఇతర విద్యుత్‌తో పోల్చితే కారు చౌక. ఇతర విభాగాల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ యూనిట్ రూ. 3.50 పైసలు ఉంటే, జల విద్యుత్ మాత్రం యూనిట్ రూ.1కే లభిస్తుంది. జల విద్యుత్ లభ్యతలోకి రాకపోవడంతో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ యూనిట్లపై భారం పడింది. రోజుకు 185 ఎంయు విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర విద్యుత్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది.