ఆంధ్రప్రదేశ్‌

ముగ్గురు చిన్నారుల జల సమాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుక్కరాయసముద్రం, సెప్టెంబర్ 6: నీటివంకలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా శింగనమల మండలం గుమ్మేపల్లిలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన తేజ (6), నాగిరెడ్డి (7), అరవింద్ (7) స్నేహితులు. బుధవారం మాల పున్మమి కావడంతో బడికి వెళ్లకుండా ఇంటివద్దే ఉన్నారు. ఆడుకునేందుకు గ్రామశివారులోని వంక వద్దకు వెళ్లారు. రాత్రి కురిసిన వర్షానికి వంకలో నీరు ఉద్ధృతంగా వవహిస్తోంది. ఇదేమీ గమనించిన వారు నీళ్లలోకి దిగారు. ఈత రాకపోవడంతో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్థులు సంఘటనా స్థలానికి వెళ్లేసరికి ముగ్గురు విగతజీవులుగా కనిపించారు. మృతులంతా వారి కుటుంబాలకు ఒక్కగానొక్క మగ సంతానం కావడం గమనార్హం. దీంతో మూడు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. మృతుల కుటుంబాలకు రూ.లక్ష పరిహారాన్ని సిఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు.