ఆంధ్రప్రదేశ్‌

జీఓ నెం 64 రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 6: వ్యవసాయ కళాశాలకు సంబంధించిన జీఓ 64ను రద్దు చేసినట్టు వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. ఎప్పటిలాగే జీఓ 16 కొనసాగుతుందన్నారు. దీంతో రాష్టవ్య్రాప్తంగా చేపట్టదలచిన సమ్మెను విరమిస్తున్నట్లు అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థులు అంగీకరించినట్లు మంత్రి తెలిపారు. అగ్రికల్చర్ కళాశాలలపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించిందన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వెలగపూడి సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవసాయ కళాశాలల విద్యార్థుల వినతిమేరకు 64 జీఓను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ కళాశాలలపై కేంద్రం చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉందన్నారు.
ఈ ఖరీఫ్‌లో వర్షాలు సకాలంలో కురవకపోవడం వల్ల 4 లక్షల హెక్టార్లలో వేరుశనగ విత్తనాలను రైతులు వేయలేకపోయారని మంత్రి తెలిపారు. ప్రత్యామ్నాయంగా 1.5 లక్షల క్వింటాళ్ల ఉలవలు, పెసర, కంది, మినుము, జొన్న విత్తనాలను ప్రభుత్వం వందశాతం రాయితీతో రైతులకు అందజేసిందన్నారు. ఇప్పటివరకూ 15,925 క్వింటాళ్లు విత్తనాలు సరఫరా చేశామన్నారు. రాష్ట్రంలో సాధారణ సాగు 33.38 లక్షల హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా, 7 శాతం తక్కువగా 31.26 లక్షల హెక్టార్లలో రైతులు సాగు చేశారన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 54 లక్షల భూసార పరీక్ష కార్డులను అందజేశామన్నారు. 3వ విడత రైతు ఉపశమన పథకం కింద 3,600 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామన్నారు. ఇప్పటికే పిడి అకౌంట్లలో ఈ మొత్తం జమ అయ్యిందన్నారు. ఈనెల 10 తరువాత రైతుల అకౌంట్లలో జమవుతుందని వెల్లడించారు. బ్యాంకర్లు, ఇతర కారణాల వల్ల రైతు ఉపశమనం పథకం అందని 9 లక్షల మంది రైతులు ఫిర్యాదు చేశారన్నారు. వారిలో 5 లక్షల 47 వేల మంది రైతులకు రూ.528.37 కోట్ల రూపాయలు అదనంగా అందజేయనున్నామన్నారు. ఇవేకాక మరో 44 వేల అర్జీలు కొత్తగా వచ్చాయన్నారు. వాటికి రూ.18.87 కోట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ ఏడాది విత్తనాల సబ్సిడీ కోసం ప్రభుత్వం రూ.267.90 కోట్లు వెచ్చించిందని మంత్రి తెలిపారు. 2016 ఖరీఫ్‌కు సంబంధించి రూ.657 కోట్ల ఇన్సూరెన్స్ కింద బ్యాంకులు అందజేశాయని, రూ.552 కోట్లు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. మిగిలిన మొత్తాన్ని త్వరలోనే మిగిలిన రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు.
2015 కరవు, 2016లో అధిక వర్షపాతం, 2017 తెగుల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.1900 కోట్లు అందజేస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ.1500 కోట్లకు పైగా రైతులకు పంపిణీ చేశామన్నారు. పులివెందుల నియోజకవర్గంలోనూ బ్యాంకర్ల పొరపాటు వల్ల 2 వేలమంది రైతుల ఉపశమన పథకం కింద నష్టపరిహారం పొందలేకపోయారన్నారు. ఈ సమస్యను ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో, ఆ రైతులకు న్యాయం చేయగలిగామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది రైతు రథాల కింద 11 వేల ట్రాక్టర్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి చెప్పారు. నెలాఖరులోగా 70 శాతం మేర రైతు రథాలు పంపిణీ చేస్తామన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణకు రూ.423 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. డ్రిప్ స్ప్రింకర్ల కోసం రూ.1,127 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు డ్రిప్ స్ప్రిక్లర్లను ఉచితంగా అందజేస్తున్నట్టు మంత్రి సోమిరెడ్డి చెప్పారు.