ఐడియా

కాఫీ ‘కళ’కళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయానే్న కాఫీ తాగితేనే కాని కొంతమందికి ఉత్తేజం రాదు. కాఫీ కడుపులో పడకపోతే బద్ధకం వదలదు. అలా కాఫీని ఆస్వాదిస్తున్నపుడు పొరపాట్న ఎవరి చేయో తగిలి ఒలికిపోతే- చేయి కాలిందనో, నేలమీద, బట్టలమీద మరకలు పడ్డాయనో చర్రున కోపం వస్తుంది. ఆ సమయంలో అరిచేస్తారు కొంతమంది. ఇంకొంతమంది ‘మరక మంచిదే’ అని నిట్టూరుస్తూ శుభ్రం చేసుకుంటారు.. అయితే ‘మారియో అరిస్టిడో’ అనే కేక్ డిజైనర్ మాత్రం ప్రమాదవశాత్తు కాఫీ ఒలికిపోతే చిరాకు పడలేదు సరికదా నేలపై పడ్డ కాఫీ మరకల్లో డిజైన్ చూసింది. అంతే, కాఫీలో కుంచె అద్ది అద్భుతమైన డిజైన్స్ వేయడం మొదలుపెట్టింది. మొదట్లో అనుకోకుండా చేసినా తర్వాతర్వాత కాఫీ డిజైనుల మీద ఏకాగ్రతతో పట్టు సాదించి ఎవరూ వేయని, వేయలేని విధంగా చిత్రాలను మలిచింది. దాంతో ఆమెకి ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది. యూరప్‌కి చెందిన మారియో చిత్రాలకు ఇపుడు భలే గిరాకి.
కొన్ని కొన్ని ప్రమాదశాత్తు జరిగినా ‘అంతా మనమంచికే’ అనుకుంటే ఫలితం అమోఘంగా ఉంటుంది. కాఫీ ఒలకడం ఎంతో మంచిగా అనుకోవడమే కాదు.. ఒలికిన కాఫీని ‘కుంచె’కి అద్ది తనదైన సృజనతో కొత్త తరహా కళకి ప్రాణం పోసింది.

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి