ఖమ్మం

సీతారామ ప్రాజెక్టు పనులను అడ్డగించిన సిపిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశ్వాపురం: సీతారామ ప్రాజెక్టు కింద భూములను కోల్పోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించి, పనులను కొనసాగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ డిమాండ్ చేసింది. గురువారం ఆ పార్టీ ఆధ్వర్యంలో భీమునిగుండం కొత్తూరు, సీతారామపురం గ్రామాల మధ్య జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు పంపుహౌస్ నిర్మాణ పనులను భూ నిర్వాసితుల ఆధ్వర్యంలో సిపిఐ అడ్డుకుంది. తమకు పరిహారం చెల్లించకుండా తమ భూముల్లో పనులు చేయించడానికి వీల్లేదని, పనులు జరుగుతున్న ప్రదేశంలో సిపిఐ నాయకులు, నిర్వాసితులు పనులను అడ్డగించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించేంత వరకు ఆ భూముల్లో పనులు చేపట్టకూడదని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా మాట్లాడుతూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై నిర్వాసితులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కింద ఉన్న నిర్వాసితులకు న్యాయం చేస్తామని చెప్పిన అధికారులు నేడు మాట తప్పుతున్నారని ఆరోపించారు. రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, రైతు భూముల్లో పరిహారం చెల్లించకుండా కాంట్రాక్టర్ పనులకు సంబంధించిన వాహనాల కోసం రైతుల భూములను ఆక్రమించుకోవడం సరైంది కాదని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మి.అయోధ్య అన్నారు. రైతుల పక్షాన సిపిఐ ముందుండి పోరాడుతుందన్నారు. సీతారామ ప్రాజెక్టు నిర్వాసితులందరికీ నష్ట పరిహారం వెంటనే చెల్లించాలని, నిర్వాసితులపై బెదిరింపులను మానుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు పంపుహౌస్ నిర్మాణ పనుల కాంట్రాక్టర్‌తో రైతులకు చెల్లించే నష్టపరిహారం విషయమై మాట్లాడారు. నష్టపరిహారం చెల్లించేంత వరకు పనులు కొనసాగించరాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు రావులపల్లి రాంప్రసాద్, సర్రెడ్డి పుల్లారెడ్డి, కమటం వెంకటేశ్వరరావు, అనంతనేని సురేష్, నిర్వాసిత రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అశ్వాపురం సిఐ అల్లం నరేందర్ ఆధ్వర్యంలో ఎస్సైలు శ్రావణ్‌కుమార్, సిబ్బంది ప్రాజెక్టు నిర్మాణ పనుల వద్దకు చేరుకున్నారు.