డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 100

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈసారి ఫోను ఎత్తేటప్పుడే ఒక్క క్షణం డయలుటోను వినిపించింది. వెంటనే వౌళికి ఫోన్ చేశాను. అంతలోనే మళ్లీ పోయింది.
గడియారం నడవడం మానేసింది. ఒంటరిగా చెప్పలేని క్షోభ అనుభవిస్తున్నాను. ఏమీ తెలియని పరిస్థితి. అంత నరకం మరొకటి వుండదు.
అయినా లేచాను. పాపాయి పనులు చూస్తూనే ఉన్నాను. దాని అమ్మ ఏమయిపోయిందో, ఎలా వుందో తెలియదు. నాన్న ఎక్కడ వెతుకుతున్నాడో తెలియదు. ఏమీ తెలియని పసిపిల్ల నిట్టూర్చాను. ఎంత దారుణం.
ఎందుకో తేజా, వౌళిలిద్దరూ తిరిగి వస్తారనిపిస్తోంది. పాపం ఎలా ఉన్నారో అనుకుంటూ కొంచెం వంట చేశాను.
నేను పొద్దుటినుంచి ఏమీ తినలేదు. అయినా ఆకలి అనిపించడంలేదు. నీరసంగా అనిపించడంలేదు. భయం అనుమానం అన్నిటినీ ముంచేస్తున్నాయి.
దాదాపు ఆ రాత్రి 10 గంటలవుతుంటే- తలుపు తెరుస్తున్న చప్పుడు వినిపించింది. చటుక్కున లేచి నుంచున్నాను.
వౌళి లోపలకు వస్తున్నాడు. వళ్ళంతా సిమెంట్ ధూళితో నిండిపోయి, ఒక కాందిశీకుడిలా ఉన్నాడు. వాడిని చూచాక నేనేమీ అడగవలసిన అవసరం కనుపించలేదు.
వౌనంగా వాడివంకే చూస్తూ ఉండిపోయాను. వాడు హఠాత్తుగా నన్ను కౌగిలించుకున్నాడు. మెడ వంపుల్లో తల దాచుకున్నాడు. నా రెండు చేతులు వాడి ఛాతిని చుట్టేశాయి. ఓదార్పుగా వాడి వీపుమీద చేతులతో పైకి క్రిందకూ రాస్తున్నాను.
ఉదయం నుంచి అనుభవిస్తున్న ఆక్రోశం, భయం అసువులుగా మారి నా మెడ పడుతున్నాయి. ఆవేశంతో శరీరం వణుకుతుంది.
‘‘దొరకలేదమ్మా తేజ ఏమయిందో ఎవ్వరికీ తెలియదు. బ్రతికుందో - ఆ రాళ్ల క్రింద పడివుందో ఏమీ తెలియదు. ఇంకారాళ్ల కింద వెదకుతూనే ఉన్నారు. 14గంటలు అయిపోయింది. నాకు భయంవేస్తోంది’’ అన్నాడు.
‘‘్ధర్యం కోల్పోకు వౌళి. తేజ దొరుకుతుంది ప్రాణాలతో, భయపడకు.’’.
‘‘నీకు నిజంగా అలా అనిపిస్తోందా!’’ తల ఎత్తి నా వంక చూచాడు. ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడికి ఎదురయిన గడ్డిపోచ.
తల ఊగించాను అవునన్నట్లు. ‘‘పొద్దుటినుంచి ఎన్నిసార్లు దేముడి ముందు నుంచున్నానో- అన్నిసార్లు అదే అనిపించింది’’ అన్నాను. నూటికి నూరపాళ్లు అంత ధైర్యం నాలో లేకపోయినా!
వౌనంగా వూరుకున్నాడు.
లే! వెళ్లి స్నాం చెయ్యి అన్నాను. అయినా లేవలేదు. టీవీ వంకే చూస్తూ ఉండిపోయాడు. పోయిన 14 గంటలలో జరిగిన ప్రతి విషయం చర్వితచరణంలాగా టీవీలో వస్తూనే ఉంది.
వాషింగ్టన్‌లోనూ, పెన్సిల్‌వేనియాలోనూ కూడా జరిగాయట అన్నాను.
తల ఊగించాడు.
ఒక్క ప్రయాణీకులు, క్రూ మెంబర్స్ మాత్రమే చనిపోయింది ఒక్క పెన్సిల్‌వేనియాలో మాత్రమే! అదెలా కూలిపోయిందో విన్నావా?’’
లేదన్నట్టు తల వూగించాడు.
‘‘ఆ విమానం బయలుదేరడం ఆలస్యమయిందట. అందులో వున్న కొంతమంది ప్రయాణీకులకు, బయట నుంచి వచ్చిన టెలిఫోనుల ద్వారా బయట ఏం జరుగుతుందో తెలిసిందిట. వారెవరినీ, ఆ విమానం ఎటు వెళ్లబోతోందో దేన్ని విధ్వంసం చెయ్యాలనుకుంటోందో కూడా తెలియదు. అయినా సరే ఆ పని జరగకుండా వుండాలి. ఆ అగంతకులతో పోరాడడానికి నిశ్చయించుకున్నారట’’.
ఇదంతా బయటవాళ్లకు టెలిఫోను ద్వారా తెలిసిందిట అన్నాను వౌళితో, అవునా అన్నట్లు చూచాడు. ట్విన్ టవర్స్ చుట్టుప్రక్కల అయినవాళ్ల ఆచూకీ కోసం తిరుగుతున్నవాళ్లెవరికి బయట జరుగుతున్న వార్తలు పూర్తిగా తెలియలేదు. వాళ్ల ఆందోళనలలో వాళ్లున్నారు.
దేశభక్తి పుట్టుకతో వస్తుంది. తమ దేశంలో మరేదీ ధ్వంసం కాకూడదని ఆ ప్రయాణీకులు తీసుకున్న నిర్ణయం. ఏ సోల్జరు కర్తవ్యానికి తక్కువ కాదు. ఆ రోజు ఉదయం వందలకొద్ది మరణించిన ఏ ఫైరు ఫైటర్ కర్తవ్యానికి తక్కువ కాదు.
వౌళికి నా మాటలు ఎంత వినిపిస్తున్నాయో తెలియదు. పూర్తిగా పరధ్యానంగా ఉన్నాడు. కళ్లు టీవీమీద వున్నాయి. మనసు ఎక్కడోవుంది.
ఇంతలో తలుపు ఎవరో తట్టినట్లయింది. ఇద్దరి ఉలిక్కిపడ్డాం. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం.
గభాల్న లేచాడు వౌళి. తలుపు తెరిచాడు. ఎదురుగా సావిత్రి, మూర్తిగారు. మొహాలు వాడిపోయి వున్నాయి. ఎంతసేపటి నుంచి డ్రైవ్ చేస్తున్నారో.
అల్లుడి అవతారం చూడంగానే వాళ్ళిద్దరికీ అవగతం అయింది మంచి వార్త ఏమీ లేదని.
సావిత్రి నన్ను కౌగలించుకుని ఏడ్చేసింది. మూర్తిగారి కళ్లు తడిగా ఉన్నాయి. అల్లుడిని దగ్గరకు తీసుకున్నారు మూర్తిగారు.
పొద్దున టీవీలో రుూవార్త వినగానే తేజాకి, వౌళికి ఎపార్ట్‌మెంట్‌కు ఎన్నో ఫోన్స్ చేశారుట. ఒక్క ఫోన్ కూడా కలవలేదు. స్నేహితులకు చేసినా దొరకలేదుట. వాళ్లకేం చేయాలో పాలుపోలేదు. న్యూయార్క్‌లో విమానంలో వద్దామంటే విమానాల రాకపోకలు పూర్తిగా ఆపేశారు.
‘‘వెంటనే కారులో వద్దామని నిశ్చయించుకున్నాం. ఇంట్లో శశి వుంది. దాన్ని ఆరోగ్యం బాగాలేదు కదా! వంటరిగా వదిలే పరిస్థితి కాదు. మా స్నేహితున్ని ఒకర్ని పిలిచి రెండు రోజులు మా ఇంటికొచ్చి వుండమని చెప్పి కారులో బయలుదేరాం.
‘‘మాలాంటివాళ్లు చాలామంది వుండి వుంటారు. ఒకటే ట్రాఫిక్. ఇప్పటికి చేరగలిగాం’’ అంది సావిత్రి.
పొద్దుననుంచి కారులో రేడియో వార్తలు వినడం తప్ప చూడటం కుదరదని వాళ్లిద్దరూ టీవీకి అతుక్కుపోయారు. ఆ రాత్రంతా సర్వైవర్స్ కోసం వెదుకుతూనే ఉన్నారు. రబుల్స్ అన్నీ జాగ్రత్తగా తొలగిస్తున్నారు. 16 గంటల నుండి అవిరామంగా పనిచేస్తూనే ఉన్నారు. అందరిదీ ఒకటే ధ్యేయం. ప్రాణాలతో వున్న ప్రతి ప్రాణిని బయటపడేయాలని- ఆ భావనే వాళ్లకు శక్తినిస్తోంది. ఎంతోమంది ఫైర్ ఫైటర్స్ పై రాష్ట్రాలనుండి వచ్చేశారు. ఏ మాత్రం పని ఆపేందుకు సిద్ధంగా లేరు.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి