భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం- 19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు మాబా మహిల్సాపతి ఆగు కాస్త డేంగల్‌ను మంచినీరు తాగనివ్వు. ఆయన కూర్చుంటారు. ఇక అప్పుడు నీ పురాణం చెప్పు మేము వింటాము అన్నాడు బాబా.
అప్పుడు నాకు కాస్త నీళ్లు కావాలి. ఎంతో దాహంగా వుంది అన్నాడు. డేంగల్ ఇదిగో ఈ నీరు తాగి కూర్చో అంటూ సాయి నీళ్లు అందించాడు డేంగల్‌కు. నీళ్లు తాగాక స్థిమితంగా కూర్చున్నాడు బాబా ఎదురుగుండా. మహిల్సాపతి పురాణం చెపుతున్నాడు.
ద్వాపరయుగంలో కృష్ణుడు ఉండేవాడు కదా. ఆయనకు కుచేలుడన్న స్నేహితుడు ఉండేవాడు. ఆ కుచేలుని అసలు పేరు సుధాముడు. ఎప్పుడూ కృష్ణునితోనే చెలిమి చేసేవాడు. చిన్నప్పటినుంచి వారిద్దరూ సహాధ్యాయులు. గురుకులాన్ని వదిలిన తరువాత ఎవరికివారు విడిపోయి వారి వారి జీవన వ్యాపారాలు సాగిస్తున్నారు.
ఈ సుధామునికి గంపెడు సంతానం. సాగుచేసుకుని బతికే వీరికి జీవనాధారం వ్యవసాయమే. దాంతో వీరు పేదరికం అనుభవించేవారు. పిల్లలకు మంచి బట్టలు, సరియైన తిండి ఇవ్వడానికి కూడా సుధామునికష్టం అయ్యేది. కాని ఆయన ఎప్పుడూ భగవంతుడే అన్నీ చేయిస్తాడు. పూర్వ జన్మలో మనం దానం ఇవ్వలేదు కనుక ఇపుడు మనకు ఏమీ లేదు అనేవాడు.
కాని అన్ని రోజులు అలానే వుండవు కదా. ఆయన భార్య మహా ఇల్లాలు సుశీల.
ఆమె ఒక రోజు ‘ఏమండీ! మీ స్నేహితులు ద్వారకాపుర వాసులు మహారాజులు కదా. వారు ఆగర్భ శ్రీమంతులు. మీరు వారిని ఒకసారి దర్శించి మన కష్టాలు చెప్పండి. వారు మనకేదైనా భుక్తి గడపడానికి మార్గం చూపిస్తారు’ అంది.
అంతా విన్న సుధాముడు ‘ఏమిటీ నా కృష్ణయ్య దగ్గరకు వెళ్లి ఈ కడుపు నింపడం కోసం అర్థించమంటావా. కృష్ణుని దగ్గరకు పోయి ఏమి అడగాలో కూడా నీకు తెలియదు’ అన్నాడు.
పోనీ మీకు తెలుసు కదా. ఏమీ అడగవద్దు, ఊరికినే చూచి రండి. ఆయనను చూస్తే మన కష్టాలు తీరే మార్గం ఆయనే చూపిస్తాడు అంది.
అబ్బా కాని నా చిన్నప్పటి నేస్తాన్ని చూడడానికి వెళ్తూ నేనేమి తీసుకుని వెళ్లకపోతే ఏం బాగుంటుంది. అయినా శాస్త్రం పెద్దవారిని, రాజులను రోగులను చూసి రావటానికి వెళ్లితే ఏదైనా పండునో, పూలనో తీసుకుని వెళ్లాలని చెప్తుంది కదా. ఇపుడు కాదులే మన దగ్గర ఏదైనా ఉంటే దాన్ని తీసుకుని వెళ్లి ఇచ్చి ఆయన్ను నువ్వు కోరినట్లు చూసి వస్తాను అన్నాడు సుధాముడు.
అయ్యో నా రాత. అన్ని ఉంటే ఇక నాకు కొదువ ఏముంది. అదికాదు, ఇదిగో మన ఇంట్లో అటుకులు ఉన్నాయి. ఇవి ఆయనకు చాలా ఇష్టం అని విన్నాను. వీటిని మీ అంగవస్త్రంలో కట్టి ఇస్తాను. ఇవి ఆయనకు ఇవ్వండి చాలు. ఆయనే మిగతా విషయాలు చూస్తారు. మీరు ఏమీ అడగకపోయినా చాలు అంది.
ఆయన భార్య పోరు పడలేక బయలుదేరాడు.
నేను నా చిన్నప్పటి నేస్తాన్ని చూసి చాలా రోజులు అయిందే. ఆ రోజుల్లో మేమంతా ఒక్కటిగానే మెలిగేవారిమి. సమిధలు తేవాలన్నా, ఆడుకోవాలన్నా, చదువుకోవాలన్నా మేమిద్దరూ ఒకటిగానే ఉండిపోయాం.
ఒకరోజు మేమిద్దరం సమిధలు తేవడానికి అడవికి వెళ్లాం. మధ్యాహ్నం దాకా అడవిలో తిరిగి సమిధలు ఏరుకున్నాం. కాని అంతలోనే పెద్దవాన వచ్చింది. దాంతో మేము అడవినుంచి తిరిగి రాలేకపోయాము. పశువులు ఇంటిముఖం పట్టాయి.
కాని మేము మాత్రం చెట్టు దిగలేదు. రాత్రి అంతా అక్కడే ఉండిపోతామా అని భయం పట్టుకుంది. నేను, కృష్ణుడు ఇద్దరమూ ఒకరి చేతిని మరొకరం పట్టుకుని రామా రామా అనుకుంటూ ఉండిపోయాం. పాపం మా గురువుగారు దీపం తీసుకుని మమ్మల్ని వెతుకుతూ వచ్చి ఆశ్రమానికి తీసుకుని వెళ్లారు. ఆ రోజు మాకెంతో భయం వేసింది.
అలా మేము ఎక్కడ తిరిగినా సరే ఒక్కటిగానే ఉండిపోయాం. కాని ఈ గృహస్థాశ్రమానికి వచ్చిన తరువాత మేము ఇద్దరం ఒకరిని ఒకరు చూసుకునే లేదు. నేను ఏమో ఈ సంసారంలో మగ్గిపోయాను. కృష్ణయ్య ఏమో రాజరికంలో కూరుకుపోయినట్టు ఉన్నాడు అనుకున్నాడు సుధాముడు.
చాలా దూరం నడిచినట్టున్నాను. కాసేపు ఈ చెట్టు కింద కూర్చుని తరువాత ద్వారకకు పోదాం అనుకుని ఓ చెట్టు కింద విశ్రమించాడు సుధాముడు. మెల్లగా చల్లగాలికి నిద్రపట్టింది.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743