మంచి మాట

రక్షణ కవచం రాముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని కాలాల్లోను, అన్ని అవస్థల్లోను, అందరికీ రామనామము కల్పవృక్షము. రామ అన్న నామమే ధర్మార్థ కామ మోక్షములనిచ్చునది, శంకరుని వంటి దైవమే రామనామానే్న పరమార్థ సారముగా చెబు తున్నారు. కాశీ నగరంలోని కాశీ విశే్వశ్వరుడుకాశీలో చనిపోతున్న వారి చెవిన రామనామాన్ని వూదుతాడట. సంసార సాగరాన్ని దాటలేనివారు, కష్టాల కడలిని ఈదలేనివారు రామనామాన్ని జపిస్తే చాలు వారు ఏ మాత్రం కష్టం లేకుండా గట్టు చేరుతారు. మనిషి బతకఢానికి గాలి నీరు ఎంత ముఖ్యమో ప్రతి మనిషి ఆనందం పొందడానికీ, ఈ మనుష్య జన్మ సార్థకం చెందడానికీ కూడా రామనామమే తరణోపాయం. రోగార్తులకు, ఆపన్నులకు, ఆర్తులకు, దీనులకు, ధనవంతులకు, శ్రీమంతులకుఎవరికైనా సరే అందరికీ రామనామమే అమృతంతో సమానమే.
శ్రీరామునిపై ప్రేమతో శ్రీరామనామాన్ని జపిస్తే అన్ని కోరికలు ఈడేరుతాయ. శ్రీరామ నామమన్నది అసహాయులకుసహాయం, అభాగ్యులకు భాగ్యము, గుణహీనులకు గుణము, దీనులకు ఆపన్నహస్తము ఇలా ఎవరు ఏది కోరితే దాన్ని సమకూర్చు శక్తి గల నామము శ్రీరామ నామం. రామనామ స్మరణ అవిటివాడికి హస్తపాదములై, అంధులకు నేత్రాలయి, ఆకలిగొన్నవారికి తల్లిదండ్రులై, నిరాధారులకు ఆధారమై, భవసాగరము దాటుటకు సేతువై ముక్తికి హేతువై పరిఢవిల్లుతుంది. చలికి అగ్ని వంటింది వేసవికి చల్లని మలయమారుతం.
రామనామమను కల్పవృక్షాన్ని ఆశ్రయిస్తే ఇహపర సౌకర్యాలను పొందుతారు. రామనామమును నిదివరకు ప్రేమించినవారు, ఇప్పుడు ప్రేమించుచున్నవారు, ముందు ప్రేమించబోవువారు, వీరినే ప్రపంచము మహాభాగ్యవంతులుగా గుర్తిస్తారు. సీతమ్మ తన భర్తఅనే కాక తన దైవం గురువు రాముడేఅని ఎంచి నిరంతరం రామనామస్మరణలో ఓలలాడేది.
విభీషణడు దూరతీరాన రావణుని దగ్గర ఉన్నా నిరంతరం రామనామాన్ని జపించి చివరకు తనకు నచ్చిన రాముడుఅనే తీరానికి చేరాడు. సుఖసంతోషాలను అనుభవించాడు. అనుమానం రేకిత్తినా ఆత్మీయుల ప్రోత్సాహంతో రాముని నమ్మిన సుగ్రీవుడు కూడా రామునికి అత్యంత ఆత్మీయుడైనాడు. ఇక రామకైంకర్యానికే జీవితాన్ని ధారపోసిన ఆంజనేయుని గురించి చెప్పాల్సింది ఏముంది? సీతమ్మను అనే్వషించడం లోను, సముద్రానికి సేతువు కట్టడంలోను, వానరులనే కాదు సుగ్రీవుని సైతం కార్యోన్ముఖుని చేయడంలోను ఆంజనేయుని పాత్ర గణనీయమైంది. రామునికి కలిగిన ఆనందానికి రూపమే రామాంజ నేయుల కౌగలింత. లక్ష్మణభరత శత్రుఘు్నల కన్నా ఆంజనేయుడు మిన్న అన్నా కూడా అందులో దోషమేమీ ఉండదు. లక్ష్మణాదులందరూ రాముని తోబుట్టువులే. వారు రామునితో ఉంటూ రామునికి అనుయాయులుగా ఉండడంలో అతిశయం ఏముంది? కానిరాముడు మానవుడు, మారుతి వానరుడు. వీరిద్దరి మధ్య ఆత్మీయత అనురాగం, స్నేహం ఇవన్నీ నిత్యస్మరణీయాలు. ఆచరణీయాలు.
లంకలోని త్రిజటకు సైతం రాముని గొప్పతనం తెలిసింది. ఆమె సీతమ్మను హింసించవద్దని చెప్పింది. రాముడే మనకు దైవము రావణుని దుష్టచేతలకు మనం తలవంచవద్దని తన తోటి వారికి చెప్పింది.
రాముడు తాను కేవలం మనుష్యమాత్రుడినని చెప్పేవాడు. దశరథునికి ప్రియపుత్రుడిని అని భావించేవాడు. కాని ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని మాత్రం తప్పకుండా ఆచరించేవాడు. కేవలం ధర్మాచరణతోనే అనుకొన్న విజయాలను అందుకోగలవని చేసి చూపించిన పురుషోత్తముడు రాముడు. అటువంటి రాముడు కనుక రావణుడు నిరాయుధుడై సమరాంగణంలో కనిపిస్తే ఉదాత్త స్వభావుడు రాముడు కరుణించాడు. నిరాయుధులైన వారితో నేను యుద్ధం చేయనని చెప్పాడు. సేద తీరి తిరిగి ఆయుధపాణివై కదన రంగానికి రమ్ము అపుడు నిన్ను కాటికి పంపిస్తానని ధీరోదాత్తంగా చెప్పిన ధీరశాలి రాముడు.
ఈ రాముని చరిత ను అవగాహన చేసుకొంటూ ధర్మాచరణలో ఉంటూ రాముని నామాన్ని భక్తిపూర్వకంగా జపిస్తే మానవ జన్మ ధన్యవౌతుంది.రామనామంతో అపూర్వశక్తియుక్తులు వశమవుతాయ. కర్మయోగం భక్త్భివంతో పరిపూర్ణవౌతుందని శాస్త్రాలు బోధిస్తాయి. సంపూర్ణ భక్త్భివంతో నిండిన జీవితాలు ఆపదలనుంచి ఎలా బయటపడ్డాయో వివరించే ఘటనలు కలియుగంలోను కానవస్తూనే ఉన్నాయ.

- చోడిశెట్టి శ్రీనివాస్