భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం- 20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుధాముడు నిద్ర లేచేసరికి ద్వారక పట్టణంలో ఉన్నాడు. ఆయన నిద్రలేచి అరే నేను ద్వారకకు వచ్చి నిద్రపోయినట్టు ఉన్నాను అనుకున్నాడు.
లేచి కాస్తదూరం నడిచాడో లేదో ద్వారకావాసుని భవనం దేదీప్యమానమై కాంతులతో కనిపించింది.
పట్టలేని ఆనందంతో అక్కడికి వెళ్లాడు. అక్కడి కావలిగాండ్లతో నేను చిన్నప్పటి నేస్తాన్ని వచ్చానని కృష్ణునితో చెప్పండి. ఆయన్ను చూడడానికి నేను ఎంతో దూరం నుంచి వచ్చాను అని సుధాముడు వారితో చెప్పాడు. వారు సుధాముడిని ఎగాదిగా చూసి ఇదేమిటి చినిగిన అంగవస్త్రం కట్టుకుని నిరుపేదగా కనిపిస్తున్న ఈ బడుగు బాపనితో ఈ మన మహారాజుకు స్నేహమా అనుకున్నారు. కాని ఈ విషయాన్ని అంతఃపురంలో రుక్మిణీదేవితో పాచికలు ఆడుకుంటున్న కృష్ణునికి నివేదించారు. ఆయన పరుగు పరుగున వచ్చారు.
వచ్చీ రావడంతోనే సుధామా ఎన్నాళ్లయింది నిన్ను చూసి అని ఎంతో ఆప్యాయతతో సుధాముణ్ణి కౌగిలించుకుని లోపలికి తీసుకుని వెళ్లారు.
రుక్మిణీదేవి నీళ్లు అందిస్తుంటే కాళ్లు కడిగారు. ఆయన్ను తన పర్యంకం మీద కూర్చోబెట్టుకున్నారు. ఆ సంగతులు ఈ సంగతులు అడుగుతూ చిన్నప్పటి విషయాలను నెమరువేసుకుంటూ కూర్చున్నారు. రుక్మిణీదేవి స్వయంగా వారిద్దరికీ భోజనాదులు పెట్టింది. వారు తృప్తిగా తిన్నారు. సుధామునికి మంచి వస్త్రాలను కట్టబెట్టారు. పాత అంగవస్త్రంలో కట్టుకుని వచ్చి కూడా ఈ శ్రీమంతుడైన కృష్ణున్ని చూచి తాను తెచ్చిన అటుకులు ఇవ్వడానికి సంకోచించి ఊరుకుండిపోయాడు సుధాముడు.
కాని అంగవస్త్రాన్ని చూస్తూ, అమ్మదొంగా మా వదిన నాకు ఎంతో ప్రేమగా పంపిన ఈ అటుకులు ఇవ్వకుండానే తిరిగి తీసుకుని వెళ్దాం అనుకున్నావా. నాకు ఎంతో ఇష్టమని పంపింది కదా అంటూ కృష్ణుడే అటుకులు తీసుకుని నోట్లో పోసుకుని తిన్నాడు. రుక్మిణీ వాళ్లకు కూడా మధుర పదార్థాల్లో అటుకులు ఒకటి. ఇవి నాకు చాలా ఇష్టం. నా గురించి మా వదినకు ఈ సుధాముడు అన్ని సంగతులు చెప్పి ఉంటాడు. అందుకే ఆమెకు నా కిష్టమైనవి ఏమిటో తెలిసిపోయింది. దానివల్లనే ఈ అటుకులను నాకోసం పంపింది చూశావా అంటూ అటుకులను తాను తిని అక్కడి ఉన్నవారికందరికీ పెట్టాడు.
సుధాముడు దానినంతా ఆశ్చర్యంగా చూశాడు. కాసేపు విశ్రాంతి తీసుకుని ‘స్వామి కృష్ణా నేనెప్పటికీ నినే్న మదిలో తలిచేట్టుగా నాకు వరమిమ్ము. ఇంతకన్నా నాకు ఏమీ వద్దు. నేను ఏ పరిస్థితులను ఎదుర్కొన్నా సరే నా హృదయం మాత్రం నినే్న తపించేట్టు చేయి మిత్రమా’ అని అడిగాడు.
కృష్ణుడు అలాగే మిత్రమా, నీవు ఏది కోరుకుంటే దానే్న నేను ఇస్తాను. అంతా నీ ఇష్టమే. అయినా నీవెప్పుడూ నన్ను మరిచిపోవులే నాకు తెలుసు అన్నాడు.
అలా రోజంతా గడిపి సుధాముడు ఇంటికి తిరుగుముఖం పట్టాడు. ఇరిగి వచ్చేసరికి సుధాముని ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతోంది. పిల్లలందరూ మంచి బట్టలు కట్టుకుని కృష్ణ భజన చేస్తున్నారు. సుధాముని భార్య పేదలకు అన్నదానం చేస్తూ ఉంది. దీనినంతా చూచిన సుధాముడు ఆశ్చర్యానందంలో మునిగి భార్య దగ్గరకు వెళ్ళాడు.
చూశారా! ఒక్కసారి కృష్ణయ్యను చూస్తే చాలు మనకు అపార సంపదలు వస్తాయని చెప్పాను కదా. చూశారా, పదండి ఇక అందరం కృష్ణయ్య భజన చేద్దాం అంది సుశీల.
చూశారా ఇలా బాబా తలచుకుంటే చాలు కదా.
ఆయనేం మనం ఎక్కడ ఉన్నా మనకు కష్టాలు చుట్టుముట్టకుండా చూస్తాడు అన్నాడు మహిల్సాపతి.
అవును అది నిజమే. నేను రెండు వివాహాలు చేసుకున్నాను. కాని నాకు సంతానం లేక ఎప్పుడూ కుమిలిపోయేవాడిని. కాని ఈ బాబాను దర్శనం చేసుకున్న తరువాత నాకు సంతానం కలిగింది కదా. అందుకే నేను నా దగ్గర పనివారికి ఎప్పుడూ బాబా గురించి చెబుతూ వుంటాను. మీరు కూడా వెళ్లి దర్శనం చేసుకోండి. మన కష్టాలు ఆయనకు చెప్పకపోయినా ఫర్వాలేదు. అంతా బాబానే చూసుకుంటారు అని చెప్తాను అన్నాడు డేంగలే.
నందరామ్ ఈ డేంగల్ చెప్పినట్లే నా మిత్రుడు కూడా చెప్తాడు. బాబాను నేను ఒకసారి చూశాను. అంతే అప్పటినుంచి నాకే కష్టాలు రావడంలేదు. ఒకవేళ ఎప్పుడైనా ఇబ్బందిగా ఉన్నా నాలో ఆత్మవిశ్వాసం వచ్చింది. నేను ఆ కష్టాలను ఎదుర్కోగలను అని చెప్తాడు. ఇలా నేను మారడానికి కారణం బాబానే అని ఆయన ఎప్పుడూ చెప్తునే వుంటాడు అన్నాడు నందరామ్.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743