మంచి మాట

జ్ఞానవాహిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో గురువుస్థానం ఎంతో ఉన్నతమైనది, పవిత్రమైనది. గురువు అనగా బృహస్పతి, ఉపాధ్యాయుడు, తండ్రి, తాత, అన్న, రాజు, కులపెద్ద, కాపాడువాడు, గొప్పది, అనంతమైనది అనే అర్ధాలున్నాయి. వీరందరు మనకు రక్షకులు, మార్గదర్శకులు. ‘గు’ అనగా అజ్ఞానము, ‘రు’ అనగా కాంతి, ప్రకాశము. అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించి ప్రకాశాన్ని అందచేసే గురువుయొక్క స్థానము ఎంతో ఎంతో గొప్పది. తాగుటకు నీరు, పీల్చుటకు గాలి ఎంత అవసరమో మన జీవితం సాఫల్యం కావడానికి, గురువు అంతగా అవసరం. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు పెద్దలు.
భారతీయులు పూజించే దేవతలకే గరువులున్నారంటే గురుస్థానమెంత గొప్పదో విశదమవుతుంది. శ్రీరామచంద్రుని గురువులు వశిష్ట, విశ్వామిత్రులు. శ్రీకృష్ణుని గురువు సాందీపుడు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.చంద్రుడు వెలుగుతున్నాడు.నక్షత్రాలు భాసిస్తున్నాయి. అగ్ని వెలుగుతుంది. ఈ అన్నింటిలోని కాంతి పరిసరాలను ప్రకాశవంతం చేసి వస్తు సముదాయాన్ని గోచరింపచేస్తున్నాయి. అంటే బాహ్యంలో ఏర్పడిన అంధకారాన్ని వీటి ప్రకాశంతో తొలగించి చరాచర సృష్టిని చూపిస్తున్నాయి. కాని అంతర్గతంలో ఏర్పడిన అజ్ఞానమనే అంధకారాన్ని ఎవరు తొలగిస్తారు? అంటే జవాబు గురుదేవులు. ఇదే ఆత్మప్రకాశం. ఆత్మప్రకాశాన్ని కలిగించే శక్తి యుక్తి ముల్లోకాల్లో ఒక్క గురువునకే వుంది. ఇది తథ్యం, సత్యం. మన మొదటి గురువు మాతృమూర్తి.
రామకృష్ణ పరమహంసకు ఎందరో శిష్యులున్నప్పటికీ పూర్ణ జ్ఞానాన్ని పొందిన వాడు ఒక్క స్వామి వివేకానంద మాత్రమే. ద్రోణాచార్యులకు శిష్యులెందరో ఉన్నప్పటికీ ఆయన హృదయంలో చోటు చేసుకున్నది మాత్రం ఏకలవ్యుడే. ఆ తర్వాతే అర్జునుడు. వీరబ్రహ్మేంద్రస్వామికి ఎందరో శిష్యులున్నా ఫ్రధమ స్థానం మాత్రం సిద్ధప్పదే.
గురు, శిష్య పరంపర ఈనాటిది కాదు. ఇది సనాతనమైంది. పురాతనమైంది. అలెగ్జాండరును ప్రభావితం చేసింది అరిస్టాటిల్. వీర శివాజీని సమర్ధునిచేసింది సమర్ధ రామదాసు. పురాణాలలో, చరిత్రలో గురువుకు ప్రత్యేక స్థానం ఆపాదింపబడి ఈ పుణ్యభూమిలో గురువు ఒక వెలుగు వెలిగారు.
గురువులను సప్త గురువులుగా పేర్కొన్నారు. సూచక గురువు: అంటే విద్యను బోధించే గురువు; వాచక గురువు:కుల ఆశ్రమ ధర్మాలను బోధించే గురువు; బోధక గురువు: మహామంత్రములు ఉపదేశించే గురువు; నిషిద్ధగురువు: వశీకరణ, మారణ ప్రయోగాలు నేర్పేగురువు; నిహిత గురువు: విషయ భోగాలపై విరక్తి కలిగించే గురువు; కారణ గురువు: జీవ బ్రహ్మైక్యాన్ని బోధించే గురువు; పరమ గురువు: జీవాత్మ పరమాత్మ ఒక్కటేనని ప్రత్యక్షానుభవాన్ని కలగచేసే గురువు.
పూర్ణ పురుషుడైన గురువును ఆశ్రయించడం వలన సాధకునిలో అణగారిన లోపాలనే పాపాలు పరీక్షల ద్వారా ఖండించబడతాయి. లోపాలు తొలగిపోగానే పాపాలు పటాపంచలైపోతాయి. పాపాలు తొలగిన సాధకుడు దైవానికి చేరువవుతాడు. దైవానికి చేరువైనవాడు పవిత్రుడవుతాడు. ఇతరుల తప్పులను చూపకుండా మనం చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి. అప్పుడే జీవనమార్గం సుగమమై సార్ధకత కలిగి సమర్ధులమవుతాము. గురువు మనలను తల్లివలె లాలించి తండ్రివలె మార్గదర్శనం చేసి మన జీవితానికి సార్ధకత కలిగిస్తాడు.త్రిమూర్తులను, తల్లిదండ్రులను మనం గురువులో దర్శించుకుంటాము. అందుకే గురుర్‌బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వరా...అన్నారు.
గురువే తల్లి, తండ్రి దైవం అని ఆర్యోక్తి. అటువంటి ఔన్నత్యము కలిగిన గురువులు ఎందరో వున్నారు. వారికందరికీ నమస్కరించాల్సిందే భావిభారత పౌరులను తీర్చిదిద్దడంలో ముఖ్యపాత్రవహిస్తున్న ఉపాధ్యాయులను గౌరవించడం ప్రతి మనిషి బాధ్యత.
మంచి చెడుల జ్ఞానాన్నిచ్చే గురువు లభ్యమవడంతో మనిషి జన్మ సార్థకత పొందుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలోనైనా, ఇహలోకంలో మనుగడ సాగించడంలోనైనా సరే గురువుకే ప్రథమ స్థానం. గంగవంటి తీర్థము లేదు, కేశవుని కంటే దైవములేదు అన్నా కూడా సద్గురువు త్రిమూర్తులకన్నా శక్తిశాలి అని మనకు రామాయణాది గ్రంథాలు ఉదాహరణలతో సహా చెబుతున్నాయ.

-పెండెం శ్రీ్ధర్