సబ్ ఫీచర్

పాలపుంతలో మన ‘సాహితి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతరిక్షంలో మరోసారి తెలుగు వెలుగు కనిపించింది. భూమికి అనేక కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పాలపుంతలోని ఓ గ్రహానికి సాహితి పింగళి అన్న పేరు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ మూలాలున్న బెంగళూరుకు చెందిన తెలుగు బాలిక పింగళి సాహితి పేరే అది. ఇది మనకు ఎంతో గర్వకారణమైన పరిణామం. ఇంటెల్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్ (ఐఎస్‌ఇఎఫ్)లో పాల్గొన్న ఆమె ‘ఏన్ ఇన్నోవేటివ్ క్రౌడ్‌సోర్సింగ్ అప్రోచ్ టు మోనిటరింగ్ ఫ్రెష్‌వాటర్ బాడీస్’ అన్న అంశంపై పరిశోధనాపత్రం పలువురి ప్రశంసలందుకుంది. నీటిలో కాలుష్యాన్ని ఓ మొబైల్ యాప్, కిట్ ద్వారా క్లౌడ్‌సోర్సింగ్‌ను వినియోగించి లెక్కగట్టడం ఎలాగో ఆమె ఆ పత్రంలో పేర్కొంది. ఈ పోటీలో ఆమె పరిశోధనాపత్రానికి రెండవ బహుమతి లభించింది. భూమి, పర్యావరణ విభాగాల్లో మరో రెండు బహుమతులు ఆమెను వరించాయి. వివిధ సరస్సులు, నదుల్లో కాలుష్యాన్ని క్రౌడ్‌సోర్సింగ్ ద్వారా లెక్కగట్టేందుకు ఆమె ఓ మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తూ ఆమె పరిశోధనాపత్రం సమర్పించింది. చాలామంది అమ్మాయిలు పదహారేళ్ల వయసులో తమకు నచ్చిన రీతిలో జీవితాన్ని ఆస్వాదిస్తూంటారు. కానీ అదే వయస్సున్న సాహితి లోకం వేరు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, ప్రాంతాలు కలుషితం అవుతూంటే చూస్తు కూర్చోవడం తనకు ఇష్టం లేదంటుందామె. ఇలాంటి పరిస్థితులను విస్మరించడం తనవల్లకాదంటుంది. ‘నా జీవితంలో సగభాగం అమెరికాలోను, మిగతా సగభాగం బెంగళూరులోను గడిపా. రెండు ప్రాంతాల్లోని పరిస్థితులను నిశితంగా గమనించా. మన పట్టణాలు మురికిలో కూరుకుపోతున్నాయి. కాలుష్యం కోరల్లో చిక్కుకుపోయాయి. సరస్సులు కలుషితమైపోయాయి. నిపుణులు, స్థానికులు, వివిధ వర్గాలను కలిశా. సర్వేలు చేశా. అభిప్రాయాలు తెలుసుకున్నా. గణాంకాలు సేకరించా. ముఖ్యంగా నీటివనరులు తీవ్రంగా కలుషితమైపోయాయి. దీనికి గల కారణాలపై అధ్యయనం చేశా. దీనికోసమే ఓ మొబైల్ యాప్‌ను సృష్టించా’ అని చెబుతోంది సాహితి. తను కనుగొన్న నూతన విధానం స్కూలు విద్యార్థులు, పౌరులు సులభంగా ఉపయోగించవచ్చని, దీనికి సైన్సు పరిజ్ఞానం అవసరం లేదని ఆమె చెబుతోంది. నీటి పరిశీలన గణాంకాలను సులువుగా సేకరించే వీలు ఈ యాప్‌వల్ల సాధ్యమవుతుందని ఆమె చెబుతోంది. నీటి కాలుష్యాన్ని మొబైల్ ఆధారిత పరీక్షలు నిర్వహించడం ఈ యాప్ వల్ల సాధ్యమవుతోంది. నీటి పరిశీలనకు ఓ చిన్నపాటి కిట్‌ను ఆమె సమకూరుస్తోంది. మొబైల్ యాప్ ద్వారా ఈ పరీక్షలు చేస్తారు. ఎలక్ట్రానిక్ సెన్సార్, కెమికల్ స్ట్రిప్స్ మొబైల్ యాప్ సహాయంతో పనిచేస్తాయి. నీటినమూనాలో వీటిని ఉపయోగించి కాలుష్యానికి సంబంధించిన గణాంకాలను సేకరించడం సాధ్యమవుతందని ఆమె వివరించింది.
* * *
సాహితి తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఎనిమిదేళ్ల వయసు వచ్చేవరకు ఆమె అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. ఆ తరువాత బెంగళూరుకు చేరుకుంది. అంతకుముందు హైదరాబాద్‌లో ఉన్న తాతగారింటిలో కొన్నాళ్లు ఉంది. ఇంట్లో తామంతా తెలుగులోనే మాట్లాడుతూంటామని చెబుతున్న సాహితి చెల్లెళ్లు లలిత, శ్రీకరి, తల్లిదండ్రులు తన విజయానికి కారణమని ఆమె అంటుంది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న సాహితి భరతనాట్యం, వీణావాద్యంలో ప్రావీణ్యం సాధించింది. కథలు చదవడం రాయడం అంటే ఆమెకు ఇష్టం. మానసిక పరిస్థితినిబట్టి కల్పన, సైన్స్ సాహిత్యాన్ని చదువుతానని సాహితి చెబుతోంది. సైన్స్, ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తున్నప్పటికీ ఏ రంగంలో స్థిరపడతానో ఇప్పుడే చెప్పలేనని, సమాజంలో పరిస్థితులను మెరుగుపరిచే రంగంపై దృష్టి ఉంటుందని ఆమె అంటోంది.

-రవళి