సిద్ధమైన సాయే దైవం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్‌చందర్, సుమన్ ప్రధాన తారాగణంగా జి.ఎల్.బి మూవీ మేకర్స్, శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలింస్ పతాకాలపై స్వీయ దర్శకత్వంలో శ్రీనివాస్ రూపొందించిన చిత్రం 3సాయే దైవం2. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. క్లీన్ యు సర్ట్ఫికెట్ లభించింది. ఈ సందర్భంగా శ్రీనివాస్.జి.ఎల్.బి మాట్లాడుతూ- షిరిడీ సాయిబాబా భక్తుల అనుభవాలను ప్రధానాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని భక్తకోటికి ఆనందదాయకంగా వుండేలా తీర్చిదిద్దామని తెలిపారు. శనివారం సెన్సార్‌వారు క్లీన్ యు సర్ట్ఫికెట్ అందజేశారని, సమాధి చెందిన నూరు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా బాబా భక్తులకు కానుకగా ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నామని తెలిపారు. ప్రతి సన్నివేశంలో భక్త్భివం ఉట్టిపడేలా ఉంటుందని, ఐదు పాటలు, మూడు శ్లోకాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయని ఆయన అన్నారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని సహ నిర్మాత భవాని అర్జునరావు తెలిపారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, సాయిప్రకాష్, ఎల్.బి.శ్రీరాం, ధన్‌రాజ్, శంకరాభరణం రాజ్యలక్ష్మి, సుధీప తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు:బిక్కి కృష్ణ, సంగీతం, మాటలు:ఘటికాచలం, కెమెరా:టి.సురేందర్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: శ్రీనివాస్.జి.ఎల్.బి.