శ్రద్ధగా సాహో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి ఘన విజయం తరువాత జాతీయస్థాయి క్రేజ్‌తో ప్రభాస్ క్రేజీ ప్రాజెక్టు సాహో చేస్తున్నాడు. 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సాహో ప్రాజెక్టు -అభిమానుల అంచనాలకు మించి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ ప్రభాస్ సరసన నటిస్తోంది. ఇప్పటికే చిత్రం సెట్స్‌లో ఆమె జాయినైంది. కాగా ఈ చిత్రంలో శ్రద్ధ పాత్ర గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. శ్రద్ధ డ్యూయెల్ రోల్‌లో కనిపించనుందన్నది బిగ్ టాక్. ప్రభాస్‌కు జోడీగా ఓ పాత్రలో కన్పిస్తే, మరో పాత్రలో నెగెటివ్ రోల్‌లో కనిపించనుందన్న సమాచారం బయటకు పొక్కింది. ఆసక్తికరమైన సమాచారంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదిలావుంటే, ప్రభాస్‌తో క్రేజీ కాంబినేషన్‌ను సెట్‌చేసి సినిమా తెచ్చేందుకూ సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్‌బాబు స్పైడర్ చిత్రాన్ని తెరకెక్కించిన మురుగదాస్, తదుపరి చిత్రంగా నేషనల్ ఇమేజ్‌తో దూసు కుపోతున్న ప్రభాస్‌తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నటు సమాచారం. స్పైడర్ చేస్తున్న మురుగదాస్, తరువాత విజయ్‌తో సినిమా చేయా ల్సి వుంది. అయితే తాజాగా ప్రభాస్‌కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాడట. మురుగదాస్ సినిమాలంటే తెలుగు, తమిళ ప్రేక్షకులకే కాకుండా అటు బాలీవుడ్‌కూ ఆస క్తి. ప్రభాస్‌తో హిందీ తెలుగు తమిళ భాషల్లో సిని మా చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడని, ఇటీవలే ప్రభాస్‌ను కూడా కలిసినట్టు చెబు తున్నారు. మరోవైపు ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఓ బాలీవుడ్ సంస్థ కూడా రెడీ అయిందట. సాహో తదుపరి చిత్రంగా మురుగదాస్‌తో ప్రభాస్ క్రేజీ కాంబి నేషన్ సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ.