ఆటాపోటీ

ప్రత్యేక శిక్షణ! (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) ఆధ్వర్యంలో వచ్చే ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగే ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలను దృష్టిలో ఉంచుకొని, స్టాలిన్‌గ్రాడ్ అధికాఠులు అందరికీ ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. ముఖ్యంగా వివిధ స్టేడియాలు, కేంద్రాల వద్ద జరుగుతున్న నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్న కార్మికులతో పోలీస్ అధికారులు డ్రెస్ రిహార్సెస్ కూడా చేయిస్తున్నారు. ఇంతకీ అది స్టేడియం నిర్మాణం లేదా ఆస్ట్రోటర్ఫ్ పచ్చిక వేయడం తదితర అంశాల్లో శిక్షణకాదు.. ఒకవేళ బాంబు దర్శనమిస్తే ఏం చేయాలన్న విషయాన్ని వారికి వివరిస్తున్నారు. వైర్లు ఎలా తీయాలో, ఏ విధంగా డిస్కనెక్ట్ చేయాలో, ఎవరెవరికి సమాచారం ఇవ్వాలో వారు ప్రత్యేక తరగతులు పెట్టి మరీ బోధిస్తున్నారు. ఇంత మంది కార్మికులకు శిక్షణనిచ్చే బదులు, భద్రతను పెంచడం ద్వారా, అలాంటి సంఘటనకు ఆస్కారం లేకుండా చేయవచ్చు కదా? అని కొంత మంది గుర్రుమంటున్నారు. పొరపాటున ఏవైనా పేలితే పరిస్థితి ఏమిటని వారి ఆందోళన.

ఇక్కడ కాదు.. అక్కడ!
* ఇంగ్లాండ్ రగ్బీ ఆటగాడు కార్ల్ ఫియర్న్స్ ఇటీవలే ఒక మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడని నిర్వాహకులు నానా హంగామా చేశారు. కానీ, తాను ఇంగ్లాండ్‌లో కొనసాగాలని అనుకోవడం లేదని, ఫ్రాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తానని ఫియర్న్స్ తేల్చిచెప్పడంతో, ఏం చేయాలో అర్థంగాక అధికారులు తలలు పట్టుకున్నారు. ఇంగ్లాండ్‌లో అతనికి వచ్చిన కష్టాలు ఏమిటో? ఫ్రాన్స్‌కు వెళ్లాలని ఎందుకు అనుకుంటున్నాడో? తెలుసుకునేందుకు తంటాలు పడుతున్నారు. కార్ల్ ఫియర్న్స్ కూడా ఈ విషయంలో నోరు మెదపడం లేదు.

జ్ఞానోదయం..
* భారత రెజ్లింగ్ సమాఖ్య (ఐడబ్ల్యుఎస్)కు ఆలస్యంగా జ్ఞానోదయమైంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనే రెజ్లర్లకు మన దేశంలో సరైన వసతులు లేవని పేర్కొంటూ వారిని ఫ్రాన్స్‌కు పంపారు. అక్కడ మన రెజ్లర్లకు అద్భుతమైన శిక్షణ లభిస్తుందని ఆశించింది. కానీ, స్వదేశీ రెజ్లర్లను నెత్తిన పెట్టుకొని, అన్ని సౌకర్యాలను వారికి మాత్రమే కల్పించే ఫ్రాన్స్ విదేశీ రెజ్లర్లను చిన్నచూపు చూసింది. తమ పోటీదారులకు ఎవరూ సవాళ్లు విసరడానికి లేదన్న రీతిలో భారత్ సహా విదేశీ రెజ్లర్లకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా సంకుచితత్వాన్ని ప్రదర్శించారు. ఇంత జరిగిన తర్వాత గానీ ఐడబ్ల్యుఎస్ అధ్యక్షుడు బ్రిజ్ మోహన్ శరణ్ సింగ్ అక్కడ ఏం జరిగిదో తెలియలేదు. రెజ్లర్లను ఫ్రాన్స్ పంపి నిజంగానే విలువైనన కాలాన్ని వృథా చేశామని వాపోయాడు. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత్ వైఫల్యాలను మూటగట్టుకున్న తర్వాత అతను చేసిన ఈ ప్రకటనకు విలువ లేకుండా పోయింది. దూరపు కొండలు నునుపు అంటే ఇదేనా?
- సత్య