నెల్లూరు

మా విన్నపాన్ని వినండయ్యా..! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాయర్ సదానందం భార్య ఇచ్చిన కాఫీ

సిప్ చేస్తూ తాపీగా న్యూస్ ఛానల్స్

చూస్తున్నాడు..
ఒక రాజకీయ నాయకుడు
‘ఆ ఊరి గాడిదలు మన ఊరికి

రావడంలేదు’
ఆవేశంగా ప్రసంగిస్తున్నాడు.
వెంటనే దాకికి కౌంటరుగా ఇంకో ఛానల్‌లో

ఇంకో నాయకుడు ‘ప్రజల్లారా.. ఆ గాడిదల

పరిపాలన నుండి మీరు

విముక్తులవలసిందిగా కోరుతున్నాను’

అంటూ
సదానందం చిరాగ్గా నుదురు

రుద్దుకుంటున్నాడు. ఛానల్ మార్చాడు.
‘గాడిదకేం తెలుసు ‘గంధం వాసన’ అంటూ

ఇంకో ఛానల్‌లో వంకర్లు తిరుగుతూ ఒక

ఏంకర్.
అంతలోనే అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం

అవుతున్నాయి. అందులో ఎమ్మెల్యేలు

కొట్టుకుంటున్న దృశ్యం.
‘నువ్వు నిలువు గాడిద’ కోపంతో

రగిలిపోతూ ఒక ఎమ్మెల్యే
‘నాచొక్కా చింపేసిన నువ్వే అడ్డగాడిదవి’

గంతులేస్తున్నాడు ఒక ఎమ్మెల్యే. వెంటనే

వెనుకనుంచి ‘మీరే కంచర గాడిదలు’

అంటూ కొందరు అరుస్తున్నారు.
సదానందం టీవి ఆపేసి నుదురు

బాదుకున్నాడు.
అసలు గాడిదలు ఈ తిట్లు వింటే

ఏమనుకుంటున్నాయి అనుకుంటూ కళ్లు

మూసుకున్నాడు.
అంతలో అనేక గాడిదలు ఓండ్రపెడుతూ

ఇంటిముందుకొచ్చి నిలుచున్నాయి.
ఉలిక్కిపడ్డాడు సదానందం
అఖిలభారత గార్ద్భ సంఘం వర్ధిల్లాలి

అంటూ నినాదం వినిపించింది.
షాక్ తిన్నాడు.
తలుపుతీసి బయటికి వచ్చాడు. ఎదురుగా

వందకి పైగా గాడిదలు నుంచుని

ఉన్నాయి.
అవి ప్లకార్డులు మెడలో వేసుకుని

కనిపించాయి.
‘మనుషుల జులుం నశించాలి, మా

జంతువుల హక్కులు కాపాడుదాం’

రకరకాల ప్లకార్డులు కనిపించాయి వాటి

మెడల్లో. సూటూ, బూటూ వేసుకున్న

రెండు నాయకుల గార్ద్భాలు ముందరికి

వచ్చి సదానందంకి ‘గ్లాడ్ టు మీట్‌యు’

అంటూ నేను అఖిలభారత గార్ద్భ

అధ్యక్షుడినండీ
నాపేరు గార్ద్భేశ్వర్ అంటూ పరిచయం

చేసుకున్నాడు.
నేను ప్రధాన కార్యదర్శిని.. నాపేరు

డాంకీరావు అంటూ మరో గాడిద

పరిచయం చేసుకుంది.
ఇది కలా, నిజమా అని ఆశ్చర్యంలో

మునిగితేలాడు సదానందం.
‘అసలు మీకేం కావాలి’ అన్నాడు.
‘మీరు హైకోర్టులో మా తరపున ఒక

వాజ్యం వేయాలి. ఈ మనుషులు

రోజురోజుకీ మరీ రెచ్చిపోతున్నారు.
మా పేర్లని తిట్లుగా వాడుతుంటే అవమాన

భారంతో, సిగ్గుతో చచ్చిపోతున్నాం ..

బాధపడ్డాడు గార్ద్భేశ్వర్
అసలు మా గాడిదల పవర్ తెలుసా మీకు
ద్వాపర యుగంలో వసుదేవుడు

వంటివాడు మా కాళ్లు పట్టుకున్నాడు

అన్నాడు డాంకీరావు.
ఉదయానే్న నిద్రలేవంగానే మీ

మురికిబట్టలు నడ్డివిరిగేలా చాకిరేవుకి

మోసుకుపోయి గాడిద చాకిరీ చేసేది

యజమాని పెట్టే గడ్డికోసం అన్నాడు

గార్ద్భరావు.
కష్టజీవులం మేము.. మా పేర్లతో

తిడుతుంటే ఇంక మేము ఊర్కునేది లేదు.

ఎంత బాధపడుతున్నామో తెలుసా...
మాకు జంతువుల హక్కులుండవా,

పరువు మర్యాదలుండవా అందుకే

న్యాయస్థానంలో మీచేత మనుషుల మీద

పరువునష్టం దావా వేయించడానికి

వచ్చాం అన్నాడు డాంకీరావు
మీలాగా మేము శవ రాజకీయాలు

చేయము, కులపిచ్చి రగల్చము, వేలాది

కోట్లు అప్పుచేసి లండన్‌కి పారిపోయి

ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి అత్యాచారాలు,

యాసిడ్ దాడులు చేయము. మాకూ మీకు

సాపత్యము..
గడ్డికూడా మమ్మల్ని మేయనీయకుండా

మీరే మేస్తున్నారు.
ఆవేశంతో గిట్టలతో నేలకేసి కొట్టి పెద్దగా

ఓండ్రపెట్టినాయి
మాకు మద్దతుగా ఇతర జంతువుల

ప్రతినిధులు కూడా వస్తున్నాయి.
అంతర్జాతీయ శునక సంఘం అధ్యక్షుడు

శునకారావు, అంతర్జాతీయ ఎద్దుల

సంఘం అధ్యక్షుడు బసవప్ప, వరాహ

సంఘం అధ్యక్షుడు వరహాలరావు వచ్చి

పరిచయం చేసుకుని సదానందంకి

కాగితాలు సమర్పించారు
శునకారావు కాశీలో మమ్మల్ని

కాలభైరవుడిగా, కాపలా కుక్కగా పనిచేసి

విశ్వాసానికి కుక్క ప్రతిరూపంగా

బతుకుతున్నాం. మమ్మల్ని చిన్నచూపు

చూస్తారా.. ఆవేశంతో శునకారాయుడు

భౌభౌ అంటూ అరిచాడు.
‘మీ అశుద్ధాన్ని ఇంటికొకక మరుగుదొడ్డి

అని ప్రభుత్వం ప్రకటించినా చాలామందికి

ఇపుడుకూడా మరుగుదొడ్లు లేవు. ఆ

అశుద్ధాన్ని శుభ్రంచేసే పర్యావరణానికి

మిత్రులాంటి కార్మికులం మేము.

పురాణంలో విష్ణువే మా అవతారంగా

వచ్చారు. అలాంటి మేమంటే చిన్నచూపా

మానవులకి గుర్రుమన్నాడు

వరహాలరావు.
‘కష్టపడి పొలందున్ని మీకు తిండిగింజలు

పండిస్తాం, పరమేశ్వరుడి వాహనం మేము

అలాంటి మమ్మల్ని ఎగతాళిగా చేస్తారా

రంకె వేశాడు బసవప్ప.
దేవుడు మాకివ్వనివి మీకు రెండిచ్చాడు..

అవి నవ్వు, మాటలు
మేము నవ్వలేం, మాట్లాడలేం, మాకు

మీలాగే హావభావాలుంటాయి. వాటిని

భంగపరచకండి.
మనుషులు నవ్వడం మరిచిపోయారు.

సౌమ్యంగా మాట్లాడడం మరిచిపోయారు.

కఠినంగా మాట్లాడి కించపరచకండి ఎవరినీ

.. అని మా విజ్ఞప్తి అన్నాయి అన్నీ

కలసికట్టుగా.
అలాగే.. మీకు న్యాయం చేస్తాను అంటూ

సంతాపంగా కాలింగ్ బెల్ శబ్దంతో

కళ్లుతెరిచాడు సదానందం. పక్కున నవ్వేసి

... ఓ ఇదంతా ఊహేనా అనుకుంటూ

నిజమైతే.. అనుకున్నాడు..

- మోపూరు పెంచల నరసింహం గోవిందరాజు సుభద్రాదేవి, 9346393501