రాజమండ్రి

సంగమ గీతం (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏరువాక
పలకరించింది
పుడమి తొలకరించింది
దివికీ భువికీ
వంతెన వేస్తూ
హరివిల్లు పల్లకీలో
వర్షచ్ఛత్రాన్ని దాల్చి
వరుణుడు దిగివచ్చాడు
విరహ గీతాలు
ఆలపించిన భూదేవి
సిగ్గుల మొగ్గ అయ్యింది
వరుణ భూదేవుల
పెళ్లంట
కరిమబ్బులే
పెళ్లి పందిరంట
ఉరుములే మేళ తాళాలంట
చిగురాకులే
పచ్చతోరణాలంట
తటిల్లతలే
చెకీ దండలంట
ఈ పెళ్లిలో
ఆడింది
మయూరం ఒయారంగా
పాడింది
చాతకం సుతారంగా
ఈ కల్యాణం
జగత్కల్యాణం
వర్షం
బ్రతుకుపాట
వర్షం - కలల తోట
ప్రణయాత్మల
సంగమ గీతం
అనంత సస్య సంగీతం
- మంకు శ్రీను
కొప్పర్రు, ప.గో.జిల్లా
సెల్: 8985990215

మా బడి
మా బడి ఎంతో అందమైంది
అచ్చం అమ్మ మోములా..!
ఊరి చివర ఉంటేనేం
అమ్మ ఊసుల తత్వమే
పచ్చని ప్రకృతి మధ్య
స్వచ్ఛంగా ఉండేది
అచ్చం అమ్మ ప్రేమలా!
అమ్మ ఒడిలా
మా బడెప్పుడూ
నిండుకుండలా ఉండేది
తన స్తన్యాల్ని మార్చిమార్చి
అందించే తల్లిలా
కడుపు నిండా విలువల్ని
విద్యని అందించేది
కథలతో ఏమార్చి
ఆకలి తీర్చే అమ్మలా
పాఠాలతో పరిపక్వతను
పెంపుచేసేది
ముద్దముద్దకీ అమ్మ
మన పొట్ట తడిమినట్లు
ఏటికేడాది మా జ్ఞానాన్ని
దివిటీలా పట్టిచూసేది
ఏమైతేనేం అంతా
ఆమె చలవే
ఇవాళ తలో దిక్కున
స్థిరంగా ఉన్నాం
కానీ అందరికీ తెలిసి
అమ్మే అనాథలా మిగిలింది!
కానె్వంట్లనే కల్తీ తల్లులొచ్చాక
డబ్బా పీకకి, తల్లి రొమ్ముకి
తేడా అనేదే
తెలుసుకోలేకుండా పోయింది
కానీ.. అమ్మెప్పుడూ అమ్మే
మా బడే మా అమ్మ
మా అమ్మే మా బడి!
ఇవాళ మా బడి
మా అమ్మ
నిరంతం వెంటాడే
తీపి జ్ఞాపకాలే!
- పెరుగుపల్లి బలరామ్,
నాగార్జున యూనివర్శిటీ,
చరవాణి : 9676636816

నాన్నంటేనే..!
నాన్నంటేనే చాలాగొప్పోడు
భూగోళం లోకాన్ని మోసినట్టు
నాయన కుటుంబగోళాన్ని

తలకెత్తుకుంటాడు
పగటి కష్టార్జితం కూటికే సరిపోనపుడు
రాత్రికూడా శ్రమసూర్యుడై చెమటలు

కక్కుతాడు

నాన్నంటేనే త్యాగమూర్తి
తాను చిరుగుల చొక్కా వేస్కొనైనా
బిడ్డలకు అందమైన దుస్తులు కొనిస్తాడు
తాను కొండంత భారాన్ని మోస్తున్నాసరే
బిడ్డల పాదాలు కందకూడదని
అందలమెక్కిస్తాడు
తనకు సంసారపు ఊబిలో ఊపిరాడకున్నా
బిడ్డల్ని గట్టెక్కించి వారి జీవితాలకు
ఊపిరిపోస్తాడు
తాను కుంభవృష్టిలో తడిచిపోతున్నా
బిడ్డలను చుక్క తాకకుండా గొడుగు

కాస్తాడు

నాన్నంటేనే జ్ఞానమూర్తి
తన అనుభవ పాఠాలన్నీ నూరిపోస్తూ
పిల్లల నడవడికను తీర్చిదిద్దుతాడు
ఆయన గద్దింపు కూడా జ్ఞానవాక్యమే
ఆయన కొట్టే దెబ్బ కూడా జ్ఞానదీపమే!
పిల్లల్ని అడుగడుగునా వెన్నంటి నడిపిస్తూ
ఆదర్శ పౌరుల్ని సమాజానికందిస్తాడు!

నాన్నంటేనే కనిపించే దేవుడు
బిడ్డలకెదురయ్యే చిక్కుముడులు

విప్పుతాడు
పిల్లల ఇష్టాలు ఎన్నయినా సరే
కష్టసాధ్యమైనా వరంగా సాధిస్తాడు
తాను చీకటిలో వుంటూ
బిడ్డల భవితకు
వెలుగుదారులు వేసేవాడే నాన్నంటే!

నాన్నంటేనే పెద్ద భరోసా
ఆ పేరు తలిస్తేచాలు గెలుస్తామంతే!
నాన్నున్నప్పుడు ఆయన విలువ

తెలియకపోవచ్చు
నాన్న మాయమైతే
ఆయన్ని స్మరించని బిడ్డలుండరు
నాన్నంటేనే కుటుంబానికి జోడెద్దు
ఇంటి బండిని ఓపికున్నంతవరకు
లాగుతూనే లాగుతూనే ఉంటాడు

కళ్లు నెత్తికెక్కిన పుత్రుల్లారా..
సర్వం మీకోసం ధారపోసిన ముసలి

నాన్నల్ని
వృద్ధాశ్రమంలోకి నెడతారెందుకురా?
మీకోసమే మీకోసమే అంతా ఖర్చయి
చిల్లిగవ్వగానూ మిగలని అమాయకుడురా

నాన్న
ఎందుకురా కొడకల్లారా..
గుండెల్లో పెట్టుకుపెంచిన నాన్నదేవుణ్ణి
కడదశలో పెడపెడగపెట్టి అవమానిస్తారు!?

నాన్నంటేనే కొవ్వొత్తి
బిడ్డల్ని వెలిగించి వెలిగించి
తుదకు తానే కరిగిపోతాడు
పొండిరా.. పొండిరా కొడకల్లారా..
వృద్ధాశ్రమాల్ని ఖాళీ చేయించండి
బతుకంతా మిమ్మల్ని
కంటికి రెప్పలా కాపాడిన నాన్నల్ని
సగౌరవంగా ఇంటికి తీసుకురండి
సాదరంగా ఆయన ఇంట్లోనే
సంభావించండి
రేపటి మీ బిడ్డలకి
ఆ ఆదరణే
ఆదర్శవౌతుంది!
- మెట్టా నాగేశ్వరరావు,
చరవాణి : 9951085760