విజయవాడ

శునక ఆక్రోశం (చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలివానలో, వాననీటిలో ఓ చిట్టి కుక్కపిల్ల మా ఇంటికి వచ్చింది. మా మనవడు, మనవరాలు దాన్ని ఆదరించి, వారి పాలు, ఇడ్లీల్లో దానికీ వాటా ఇచ్చి బొద్దుగా, ముద్దుగా తయారు చేశారు. ఆరు నెలల తరువాత దాన్ని చూసి కాలేజీ అమ్మాయి వెనుక నడిచే కుర్రకారులా నాలుగు మగకుక్కలు వెంటపడ్డాయి. అది గర్భం దాల్చింది. ఒక కుక్కపిల్ల అయితే ఫరావాలేదు, నాలుగు పిల్లల్ని కనిపెట్టింది. మా వీధిలో ఎవరు నడిచి వెళుతున్నా అరుస్తూ నిలదీస్తోంది. దాని గురించి అందరూ మాతో పోట్లాటకి రావటం మొదలుపెట్టారు. నాకు చాలా కోపం వచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ వారికి ఫోన్ చేసి దానిని, దాని పిల్లల్ని నగరానికి దూరంగా తీసుకెళ్లి వదిలేయమని కోరాను. వాళ్లు వచ్చి దాన్ని పట్టకారుతో పట్టుకుపోతుంటే దాని అరుపులకి చెవులకు చిల్లులు పడ్డాయి. దాని పిల్లల్ని కూడా ఒక అట్టపెట్టెలో తీసుకుపోయారు. ఆ రాత్రి నాకు నిద్ర లేదు. దాని అరుపుల సారాంశం.. ‘నువ్వు ఎటెళ్లినా బాడీగార్డులా వెన్నంటి వచ్చాను కదే ముసలిదానా! ఇప్పుడు నన్ను, నా పిల్లల్ని ఇలా కార్పొరేషన్ వాళ్లకి అప్పగిస్తావా? మీ కవులే’ అంటారు కదా.. ‘కుక్కకి వున్న విశ్వాసం ఈ మనిషికి లేదయ్యోయ్!’ అని. మంచి అన్నదే కానరాదు మీ మనుషుల్లో.. నా ఉసురు తగిలి పోతావే’!.. ఇలా దాని శాపనార్థాలకేనేమో మంచం పట్టాను నేను. ఇంతకీ దాన్ని దూరంగా వదిలేశారా? చంపేశారా? చంపితే మాత్రం నేను కూడా త్వరగానే స్వర్గానికి, ఛా.. నరకానికే!..

- కోట పద్మావతి, విజయవాడ.