విశాఖపట్నం

శిథిల సంస్కృతి (మినీకథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోర్టులో సెషన్స్ జరుగుతోంది.
‘‘మీ పేరు?’’
‘‘సుధారాణి’’
‘‘మీరేం చేస్తుంటారు?’’
‘‘ఓ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాను’’
‘‘మీ వారేం చేస్తుంటారు?’’
‘‘ఓ మల్టీనేషనల్ కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్’’
‘‘మీకు పిల్లలెంత మంది?’’
‘‘ఒక్కడే కొడుకు. పేరు హరీష్’’
‘‘ఓ మీది డబుల్ ఇన్‌కం సింగిల్ కిడ్ డెస్క్ ఫ్యామిలీ అన్న మాట. మీ ఇంట్లో ఇంకెవరుంటారు?’’
‘‘పని మనిషి, వంట మనిషి, వాచ్‌మేన్’’
‘‘మీరిద్దరు మీ అబ్బాయితో రోజుకు ఎంత టైమ్ స్పెండ్ చేస్తారు?’’
‘‘మాకసలు టైం ఉండదు. మా అబ్బాయి చాలా బ్రిలియంట్. క్లాస్‌లో ఎప్పుడూ ఫస్ట్ వస్తాడు’’
‘‘మీ అబ్బాయి చేసిన నేరమేమిటో మీకు తెలుసా? ఆరేళ్ల పసి పాపను రేప్ చేసి నీళ్ల ట్యాంకులోకి నెట్టి చంపేసాడు’’
ఆ మాట వింటూనే ఆ తల్లి న్యాయస్థానంలో కుప్పకూలిపోయింది.
స్కూలు యూనిఫారం ధరించిన ఆ పదేళ్ల పిల్లవాడు మాత్రం అమాయకంగా దిక్కులు చూస్తూ నిలబడ్డాడు.
ఆ తల్లి తేరుకుని వీడిలో ఇంత దుర్మార్గం ఉందా? అవగాహన లేమి, టివిలో సీరియల్స్ చూడడం, ఇంటర్నెట్ వంటి వాటి వల్లే ఇదంతా జరిగిందనుకుంటూ వాపోయింది.
పిల్లలు పసివాళ్లుగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు వారికి సంస్కారం నేర్పాలి. నైతిక విలువల్లేని బోధనా విధానమే ఈ విపరీత పరిణామాలకు ప్రధాన కారణం. పిల్లలు ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు. ఏ గ్రేడ్ సాధించారు అన్న అంశాలకు ఇచ్చే ప్రాధాన్యం వారి నైతిక ప్రవర్తన ఏ స్థాయిలో ఉందో పట్టించుకునే ఓపిక, తీరిక నేటి తల్లిదండ్రులకు లేదు. తమ ప్రైవసీ కోసం పిల్లలకు మాస్టర్ బెడ్‌రూం ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్‌ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యాలు సమకూరుస్తున్నారు.
ఇంటర్నెట్‌లో వాళ్లేం చూస్తున్నారో, టివిల్లో వాళ్లు ఎటువంటి కార్యక్రమాలు చూస్తున్నారో పట్టించుకోవడంలేదు. నేటి మన శాస్త్ర పరిజ్ఞానం అణుశక్తి వంటిది. ఆ విజ్ఞాన ఖనిని సద్వినియోగం చేసుకున్న వాళ్లు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. దుర్వినియోగం చేసిన వారు అధఃపాతాళానికి పడిపోతారు. నేరం పిల్లవాడు చేసినా బాధ్యతాయుతంగా పెంచలేని తల్లిదండ్రులను శిక్షించాలి. న్యాయమూర్తి ఇదే భావాన్ని వెలిబుచ్చి తీర్పును వాయిదా వేశారు.

- అంగర కృష్ణారావు, విశాఖపట్నం, సెల్ : 7396466528.